ఏమి
రోమీయులకు 9:17

మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను నేను నీ యందు నా బలము చూపుటకును , నా నామము భూలోక మందంతట ప్రచురమగుటకును , అందు నిమిత్తమే నిన్ను నియమించితిని.

రోమీయులకు 10:11

ఏమనగా , ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గు పడడని లేఖనము చెప్పుచున్నది .

రోమీయులకు 11:2

తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింప లేదు . ఏలీయాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా ?

యెషయా 8:20

ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి; ఈ వాక్యప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణోదయము కలుగదు.

మార్కు 12:10

–ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయెను

యాకోబు 4:5

ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా?

2 పేతురు 1:20

ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను.

2 పేతురు 1:21

ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.

అబ్రాహాము
ఆదికాండము 15:6

అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.

గలతీయులకు 3:6-8
6

అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా యెంచబడెను.

7

కాబట్టి విశ్వాససంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి .

8

దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజను లందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను.

యాకోబు 2:23

కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరుకలిగెను.

ఎంచబడెను
రోమీయులకు 4:5

పని చేయక , భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది .

రోమీయులకు 4:9

ఈ ధన్యవచనము సున్నతిగలవారిని గూర్చి చెప్పబడినదా సున్నతిలేనివారిని గూర్చి కూడ చెప్పబడినదా? అబ్రాహాము యొక్క విశ్వాస మతనికి నీతి అని యెంచబడె ననుచున్నాము గదా ?

రోమీయులకు 4:11

మరియు సున్నతి లేని వారైనను, నమ్మిన వారికందరికి అతడు తండ్రి యగుటవలన వారికి నీతి ఆరోపించుటకై , అతడు సున్నతి పొందకమునుపు , తనకు కలిగిన విశ్వాసమువలననైన నీతికి ముద్రగా , సున్నతి అను గురుతు పొందెను .

రోమీయులకు 4:22-25
22

అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను .

23

అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని

24

మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడ వ్రాయబడెను .

25

ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి , మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను .

కీర్తనల గ్రంథము 106:31

నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను .