ఇదిగో పదునెనిమిది ఏండ్లనుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెయైన యీమెను విశ్రాంతిదినమందు ఈ కట్లనుండి విడిపింప దగదా? అని అతనితో చెప్పెను.
పండ్రెండుమంది శిష్యులును , అపవిత్రా త్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్త్రీలును , అనగా ఏడు దయ్యములు వదలి పోయిన మగ్దలేనే అనబడిన మరియయు , హేరోదు యొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు , సూసన్నయు ఆయన తో కూడ ఉండిరి .
కాబట్టి అపవాది యెహోవా సన్నిధినుండి బయలువెళ్లి, అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను.
యెహోవా, నేను కృశించి యున్నాను, నన్ను కరుణించుము యెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్ను బాగుచేయుము
యేసును ఆయన శిష్యులును వెళ్లుచుండగా కొందరు, దయ్యముపట్టిన యొక మూగవాని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.
దయ్యము వెళ్లగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడిఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడును కనబడలేదని చెప్పు కొనిరి.
ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగావచ్చెను . వాడు దయ్యములు పట్టినవాడై , బహు కాలమునుండి బట్టలు కట్టు కొనక , సమాధుల లోనే గాని యింటిలో ఉండువాడు కాడు .
ఆయన వస్త్రపు చెంగు ముట్టెను , వెంటనే ఆమె రక్త స్రావము నిలిచిపోయెను .
అప్పుడాయన ఇది వీనికి సంభవించి యెంతకాలమైనదని వాని తండ్రి నడుగగా అతడు బాల్యమునుండియే;
అక్కడ ముప్పది యెనిమిది ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను.
యేసు, వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలమునుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగిస్వస్థపడ గోరుచున్నావా అని వాని నడుగగా
గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? ఆలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడని వారిని అడిగిరి.
అందుకు వాని తలిదండ్రులువీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదుము.
ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో యెరుగము; ఎవడు వీని కన్నులు తెరచెనో అదియు మేమెరుగము; వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి; తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి.
పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు మోసికొనిపోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి.
స్వస్థపరచుట అను ఆ సూచకక్రియ యెవని విషయములో చేయబడెనో వాడు నలువది ఏండ్లకంటె ఎక్కువ వయస్సు గలవాడు.
అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై యెన్నడును నడువలేక కూర్చుండియుండువాడు.
అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతనివైపు తేరి చూచి, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి
నీ పాదములు మోపి సరిగా నిలువుమని, బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులువేసి నడువసాగెను.
నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను.
నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణయుంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను.
యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు క్రుంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు
యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు యెహోవా క్రుంగినవారిని లేవనెత్తువాడు యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు