ఐగుప్తు దేశమునుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీ యులారా , మిమ్మునుగూర్చియు ఆయన రప్పించిన కుటుంబమువారి నందరిని గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి .
షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా , దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగగొట్టువారలారా మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారలారా , యీ మాట ఆలకించుడి . ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా
దేవుడును సైన్యములకధిపతియునైన ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా - నేను మీ మధ్య సంచరింపబోవుచున్నాను గనుక రాజమార్గము లన్నిటిలో అంగలార్పు వినబడును, వీధు లన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు ; అంగలార్చు టకు వారు సేద్యగాండ్రను పిలుతురు ; రోదనముచేయ నేర్పుగలవారిని అంగలార్చు టకు పిలిపింతురు.
తనకు కోపము తెప్పించు తరమువారిని యెహోవా విసర్జించి వెళ్లగొట్టుచున్నాడు; సీయోనూ నీ తలవెండ్రుకలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయుము, చెట్లులేని మెట్టలమీద ప్రలాపవాక్య మెత్తుము.
పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును; అరణ్యములోని మేతస్థలములనుబట్టి విలాపము చేయుదును; అవి పాడాయెను. సంచారము చేయువాడెవడును లేడు, పశువుల అరుపులు వినబడవు, ఆకాశ పక్షులును జంతువులును పారిపోయి యున్నవి, అవి తొలగిపోయి యున్నవి.
సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడుఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి.
స్త్రీలారా, యెహోవా మాట వినుడిమీరు చెవియొగ్గి ఆయన నోటిమాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి.
మరియు నీవు ఇశ్రాయేలీయుల అధిపతులనుగూర్చి ప్రలాపవాక్యము నెత్తి ఇట్లు ప్రకటింపుము
దాని పండ్లను దహించుచున్నది గనుక రాజ దండమునకు తగిన గట్టిచువ్వ యొకటియు విడువబడ లేదు. ఇదియే ప్రలాపవాక్యము, ఇదియే ప్రలాపమునకు కారణమగును.
వారు నిన్నుగూర్చి అంగలార్పు వచన మెత్తి ఈలాగున అందురు సముద్ర నివాసమైనదానా , ఖ్యాతినొందిన పట్ణణమా , నీవెట్లు నాశనమైతివి ? సముద్ర ప్రయాణము చేయుటవలన దానికిని దాని నివాసులకును బలము కలిగెను , సముద్రవాసు లందరిని భీతిల్ల చేసినది ఇదే.
నర పుత్రుడా , తూరు పట్టణముగూర్చి అంగలార్పు వచనమెత్తి దానికీలాగు ప్రకటన చేయుము
అప్పుడు నీ ధనమును నీ సరకులును నీవు బదులిచ్చు వస్తువులును నీ నావికులును నీ ఓడనాయకులును నీ ఓడలు బాగుచేయువారును నీతో వర్తకము చేయువారును నీలో నున్న సిపాయి లందరును నీలోనున్న జనసమూహము లన్నియు నీవు కూలు దినమందే సముద్ర మధ్యమందు కూలుదురు .
నీ ఓడనాయకులు వేసిన కేకలవలన నీ ఉపగ్రామములు కంపించును ;
కోలలు పట్టుకొను వారందరును నావికులును ఓడనాయకులును తమ ఓడల మీదనుండి దిగి తీరమున నిలిచి
నిన్నుగూర్చి మహా శోకమెత్తి ప్రలాపించుచు , తమ తలల మీద బుగ్గి పోసికొనుచు , బూడిదెలో పొర్లుచు
నీకొరకు తలలు బోడి చేసికొని మొలలకు గోనెలు కట్టుకొని మన శ్చింతగలవారై నిన్నుగూర్చి బహుగా అంగలార్చుదురు .
వారు నిన్నుగూర్చి ప్రలాప వచనమెత్తి తూరు పట్టణమా, నీతో సాటియైన పట్టణమేది? సముద్రము లో మునిగి లయమై పోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది?
నర పుత్రుడా , తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమునుగల కట్టడమునకు మాదిరివి
నర పుత్రుడా , ఐగుప్తు రాజైన ఫరోను గూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపుము జనములలో కొదమ సింహమువంటివాడవని నీవు ఎంచబడితివి , జలములలో మొసలివంటివాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్లతో నీళ్లు కలియబెట్టితివి , వాటి వాగులను బురదగా చేసితివి.
ఇది అంగలార్పు వచనము, వారు దానిని యెత్తి పాడుదురు, అన్యజనుల కుమార్తెలు దానిని యెత్తి పాడుదురు; ఐగుప్తును గూర్చియు అందులోని సమూహమును గూర్చియు ఆ వచనమెత్తి వారు పాడుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు .
ఆ దినమున జనులు మిమ్మునుగురించి బహుగా అంగలార్చుచు సామెత నెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగా-మనము బొత్తిగా చెడిపోయి యున్నామనియు , ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యుల కిచ్చియున్నాడనియు , మనయొద్ద నుండకుండ ఆయన దానిని తీసివేసెసేయనియు ,మన భూములను తిరుగబడినవారికి ఆయన విభజించియున్నాడనియు ఇశ్రాయేలీయులు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకొందురు.