ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా-జనులారా , దేశస్థులారా , ఆ యా భాషలు మాటలాడువారలారా, మీకాజ్ఞ ఇచ్చుచున్నాను.
కాగా నేనొక శాసనము నియమించుచున్నాను ; ఏదనగా , ఇవి్వధముగ రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు . కాగా ఏ జనులలోగాని రాష్ట్రములో గాని యేభాష మాటలాడువారిలో గాని షద్రకు , మేషాకు , అబేద్నెగో యనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును ; వాని యిల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండు ననెను .
సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను . ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగి పోదు ; ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు .
మొదటి నెల పదమూడవ దినమందు రాజుయొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి; హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆ యా సంస్థానములమీద నుంచబడిన రాజుయొక్క అధిపతులకును అధికారులకును, ఆ యా సంస్థానములలోని జనములమీద నుంచబడిన అధిపతులకును అధికారులకును,వారి వారి లిపినిబట్టియు, ఆ యా జనములభాషను బట్టియు, రాజైన అహష్వేరోషు పేరట ఆ వ్రాతగాండ్రచేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరముచేత ముద్రింపబడెను.
సీవాను అను మూడవ నెలలో ఇరువది మూడవ దినమందు రాజుయొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి; మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును, హిందూ దేశము మొదలుకొని కూషుదేశమువరకు వ్యాపించియున్న నూట ఇరువది యేడు సంస్థానములలోనున్న అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములకును దాని దాని వ్రాతనుబట్టియు దాని దాని భాషనుబట్టియు తాకీదులు వ్రాయబడెను.
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసి మంది యొక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వత్తుమని చెప్పుదురు .
ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి, ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి.
అప్పుడు రాజగు దర్యావేషు లోక మంతట నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆ యా భాషలు మాటలాడువారికిని ఈలాగు వ్రాయించెను - మీకు క్షేమా భివృద్ధి కలుగునుగాక.
ఆయన విడిపించువాడును రక్షించువాడునైయుండి , పరమందును భూమిమీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు . ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను.
అప్పుడు రాజుమంత్రియగు రెహూమునకును లేఖకుడగు షివ్షుయికిని షోమ్రోనులో నివసించువారి పక్షముగానున్న మిగిలినవారికిని నది యవతలనుండు తక్కినవారికిని మీకు క్షేమసంప్రాప్తియగును గాక అని యీ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చినదేమనగా
రాజైన దర్యావేషునకు సకల క్షేమప్రాప్తియగునుగాక.
మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తువారుగా ఉండుటకు పిలువబడి యున్నారు.
మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక.
విశ్వాసమునుబట్టి నా నిజ మైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక.
ఆత్మవలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడినవారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక.