ముద్రింపుము
దానియేలు 8:26

ఆ దినములను గూర్చిన దర్శనమును వివరించియున్నాను. అది వాస్తవము, అది యనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును; నీవైతే ఈ దర్శనము వెల్లడిచేయకుమనెను.

ప్రకటన 10:4

ఆ యేడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగా -ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకమునుండి యొక స్వరము పలుకుట వింటిని.

ప్రకటన 22:10

మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను -ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములకు ముద్రవేయవలదు; కాలము సమీపమైయున్నది;

to the
దానియేలు 12:9

అతడు-ఈ సంగతులు అంత్య కాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక, దానియేలూ, నీవు ఊరకుండుమని చెప్పెను.

దానియేలు 8:17

అప్పుడతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను; అతడు రాగానే నేను మహా భయమొంది సాష్టాంగపడితిని; అతడు-నర పుత్రుడా, యీ దర్శనము అంత్య కాలమును గూర్చినదని తెలిసికొను మనెను.

దానియేలు 10:1

పారసీక రాజగు కోరెషు పరిపాలన కాలములో మూడవ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను; గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే; దానియేలు దాని గ్రహించెను; అది దర్శనమువలన అతనికి తెలిసిన దాయెను.

దానియేలు 11:40

అంత్య కాలమందు దక్షిణదేశపు రాజు అతనితో యుద్ధముచేయును. మరియు ఉత్తరదేశపు రాజు రథములను గుఱ్ఱపురౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని, తుపానువలె అతనిమీద పడి దేశముల మీదుగా ప్రవాహమువలె వెళ్లును.

చాలమంది
దానియేలు 11:33

జనములో బుద్ధిమంతులు ఆనేకులకు బోధించుదురు గాని వారు బహు దినములు ఖడ్గమువలనను అగ్నివలనను క్రుంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు.

యెషయా 11:9

నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హానిచేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండియుండును.

యెషయా 29:18

ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులార చూచెదరు.

యెషయా 29:19

యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధికమగును మనుష్యులలో బీదలు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవునియందు అనందించెదరు.

యెషయా 30:26

యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశమువలె ఉండును సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును.

యెషయా 32:3

చూచువారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించును.

జెకర్యా 14:6-10
6

యెహోవా, ఆ దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును.

7

ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము పగలు కాదు రాత్రి కాదు; అస్తమయ కాలమున వెలుతురు కలుగును.

8

ఆ దినమున జీవ జలములు యెరూషలేములోనుండి పారి సగము తూర్పు సముద్రము నకును సగము పడమటి సముద్రము నకును దిగును. వేసవికాలమందును చలికాలమందును ఆలాగుననే జరుగును.

9

యెహోవా సర్వ లోకమునకు రాజై యుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును.

10

యెరూషలేము బెన్యామీను గుమ్మము నుండి మూల గుమ్మమువరకును, అనగా మొదటి గుమ్మపు కొన వరకును,హనన్యేలు గుమ్మము నుండి రాజు గానుగుల వరకును వ్యాపించును, మరియు గెబనుండి యెరూషలేము దక్షిణపు తట్టుననున్న రిమ్మోనువరకు దేశ మంతయు మైదానముగా ఉండును,

మత్తయి 24:14

మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రక టింపబడును; అటుతరువాత అంతము వచ్చును.

రోమీయులకు 10:18

అయినను నేను చెప్పునదేమనగా, వారు విన లేదా? విన్నారు గదా? వారి స్వరము భూలోక మందంతటికిని, వారి మాటలు భూ దిగంతములవరకును బయలువెళ్లెను.

ప్రకటన 14:6

అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను.

ప్రకటన 14:7

అతడు -మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను.