నీవలన గుఱ్ఱములను రౌతులను విరుగగొట్టుచున్నాను. నీవలన రథములను వాటి నెక్కినవారిని విరుగగొట్టుచున్నాను.
కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములనుబట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము.
వారు క్రుంగి నేలమీద పడియున్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము.
ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే.
యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుఱ్ఱములకును గాఢనిద్ర కలిగెను.
నే నేర్పరచిన పంక్తిని కూర్చుండి గుఱ్ఱములను రౌతులను బలాఢ్యులను ఆయుధ స్థులను మీరు కడుపార భక్షింతురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు .
దోచు కొనువారు వారిని దోపుడుసొమ్ముగా పట్టుకొనినను, వారి ద్రాక్షావల్లులను నరికివేసినను, అతిశయాస్పదముగా ఇశ్రా యేలీయులకువలె యెహోవా యాకోబు సంతతికి మరల అతిశయాస్పదముగా అనుగ్రహించును.
ఆయన బలా ఢ్యుల డాళ్లు ఎరుపాయెను, పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొనియున్నారు, ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున రథభూషణములు అగ్నివలె మెరయుచున్నవి, సరళ దారుమయమైన యీటెలు ఆడు చున్నవి;
వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి, రాజమార్గములలో రథములు ఒక దానిమీద నొకటి పడుచు పరుగెత్తుచున్నవి, అవి దివిటీలవలె కన బడుచున్నవి, మెరుపులవలె అవి పరుగెత్తుచున్నవి,
రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును; అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును; రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును; గుఱ్ఱములును రౌతులును ఒకరి ఖడ్గముచేత ఒకరు కూలుదురు.
సమస్తమైన మిశ్రిత జనులును ఊజుదేశపు రాజులందరును ఫిలిష్తీయుల దేశపు రాజులందరును అష్కెలోనును, గాజయును, ఎక్రోనును అష్డోదు శేషపువారును
అరబిదేశపు రాజులందరును అరణ్యములో నివసించు మిశ్రితజనముల రాజులందరును
కూషీయులును పూతీయులును లూదీయులును కూబీయులును నిబంధన దేశపువారును మిశ్రిత జనులందరును ఖడ్గముచేత కూలుదురు.
కోటలు పడగొట్టబడియున్నవి దుర్గములు పట్టబడియున్నవి. ఆ దినమున మోయాబు శూరుల హృదయము ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును.
బబులోను పరాక్రమవంతులు యుద్ధముచేయక మానుదురు వారు తమ కోటలలో నిలుచుచున్నారు వారి పరాక్రమము బలహీనత ఆయెను వారును స్త్రీలవంటివారైరి
ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీలవంటివారగుదురు. సైన్యములకధిపతియగు యెహోవా వారిపైన తన చెయ్యి ఆడించును ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణకి భయపడుదురు.
నీ జనులు స్త్రీలవంటివారైరి, నీ శత్రువులు చొచ్చు నట్లు నీ దేశపు గవునుల యడ్డకఱ్ఱలు తీయబడియున్నవి, అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది.
నలుదిక్కులనుండి వచ్చి దానిమీద పడుడి దాని ధాన్యపుకొట్లను విప్పుడి కసవు కుప్పలువేసినట్లు దానిని కుప్పలువేయుడి శేషమేమియు లేకుండ నాశనము చేయుడి
పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే యని నీవు తెలిసికొనునట్లు అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీ కిచ్చెదను .