అప్పుడు జనులుయిర్మీయా విషయమై యుక్తిగల యోచన చేతము రండి, యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచనలేకుండ నుండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు, వాని మాటలలో దేనిని వినకుండ మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పు కొనుచుండిరి.
దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని; ఆయన3 వారి క్రియలను నాకు కనుపర చెను.
అయితే నేను వధకు తేబడుచుండు సాధువైన గొఱ్ఱపిల్లవలె ఉంటిని;మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదము రండి, వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రదుకువారిలో నుండకుండ వాని నిర్మూలము చేయుదము రండని వారు నామీద చేసిన దురాలోచనలను నేనెరుగకయుంటిని.
నీతినిబట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను, హృదయమును శోధించువాడు సైన్యములకధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్యెభారమును నీమీదనే వేయుచున్నాను; వారికి నీవు చేయు ప్రతి దండనను నన్ను చూడనిమ్ము.
యెహోవా, నా శ్రమ నీకే తెలిసియున్నది; నన్ను జ్ఞాపకము చేసికొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించువారికి నాకొరకై ప్రతిదండన చేయుము, నీవు దీర్ఘశాంతి కలిగినవాడవై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలిసి కొనుము.
మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందినవారము; వారి నింద వారి తలలమీదికి వచ్చునట్లుచేసి, వారు చెరపట్టబడినవారై వారు నివసించు దేశములోనే వారిని దోపునకు అప్పగించుము.
వారు కట్టువారినిబట్టి నీకు కోపము పుట్టించియుండిరి గనుక వారి దోషమును పరిహరింపకుము, నీయెదుట వారి పాపమును తుడిచివేయకుము.
సైన్యములకధిపతియగు యెహోవావైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరిని శిక్షించుటకై మేల్కొనుము అధికద్రోహులలో ఎవరిని కనికరింపకుము.(సెలా.)
అల్పులు అణగద్రొక్కబడుదురు ఘనులు తగ్గింప బడుదురు కాబట్టి వారిని క్షమింపకుము .
తాము హేయమైన క్రియలు చేయు చున్నందున సిగ్గుపడవలసి వచ్చెనుగాని వారేమాత్రమును సిగ్గుపడరు; అవమానము నొందితిమని వారికి తోచనేలేదు గనుక పడిపోవువారిలో వారు పడిపోవుదురు; నేను వారిని విమర్శించుకాలమున వారు తొట్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు
వారికి శేష మేమియు లేకపోవును, నేను వారిని దర్శించు సంవత్సరమున అనాతోతు కీడును వారిమీదికి రప్పింతును.
లేఖనములలో వ్రాయబడిన వన్నియు నెరవేరుటకై అవి ప్రతి దండన దినములు .
నీ కాఠిన్యమును , మార్పు పొందని నీ హృదయమును అనుసరించి , ఉగ్రత దినమందు , అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు .