ఇది దేవునివలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము దేవునివలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే.
దుష్టులమీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములును వడగాలియు వారికి పానీయభాగమగును.
ఆ దినమున యాకోబుయొక్క ప్రభావము క్షీణించిపోవును వాని క్రొవ్విన శరీరము కృశించిపోవును
అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును.
నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి యున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.
కన్యక తన ఆభరణములను మరచునా? పెండ్లికుమారి తన ఒడ్డాణమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు.
వారు అన్యుల దేవతలచేత ఆయనకు రోషము పుట్టించిరి హేయకృత్యములచేత ఆయనను కోపింపజేసిరి
వారు దేవత్వములేని దయ్యములకు తామెరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి.
నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. నిన్ను కనిన దేవుని మరచితివి.
దుష్టులును దేవుని మరచు జనులందరును పాతాళమునకు దిగిపోవుదురు.
ఐగుప్తులో గొప్ప కార్యములను హాముదేశములో ఆశ్చర్యకార్యములను
ఎఱ్ఱసముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి .
ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే; యీ మోసకరమైన మాటలు ఆధారము చేసికొనకుడి.
ఆలాగనక, మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరచుకొని, ప్రతివాడు తన పొరుగు వానియెడల తప్పక న్యాయము జరిగించి.
పరదేశులను తండ్రిలేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషిరక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు నుండినయెడల
ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును.
ఇదిగో అబద్ధపుమాటలను మీరు నమ్ముకొను చున్నారు. అవి మీకు నిష్‌ప్రయోజనములు.
తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందు చున్నాడు; అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమియు లేదు.
నిర్బంధింపబడినవాడును స్వతంత్రుడును లేకపోవును యెహోవా చూచును తన సేవకులనుగూర్చి సంతాపపడును.
నిజముగా తన ప్రజలకు తీర్పుచేయును. ఆయన వారి నైవేద్యముల క్రొవ్వును తిని వారి పానీయార్పణమైన ద్రాక్షారసమును త్రాగినవారి దేవతలేమైరి?వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయము చేయవచ్చును వారు మీకు శరణము కానియ్యుడి అని చెప్పును.
మేము మరణముతో నిబంధన చేసికొంటిమి పాతాళముతో ఏకమైతివిు ఉపద్రవము ప్రవాహమువలె వడిగా దాటునప్పుడు అది మాయొద్దకు రాదు అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసికొంటిమి మాయక్రింద దాగియున్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే.
జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు , ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు; అయినను వారు, యెహోవాను ఆధారము చేసికొని యెహోవా మన మధ్యనున్నాడు గదా , యే కీడును మనకు రానే రదని యనుకొందురు .
చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుటవలన ప్రయోజన మేమి ? పనివాడు మూగ బొమ్మను చేసి తాను రూపించిన దానియందు నమ్మిక యుంచుటవలన ప్రయోజన మేమి ? అబద్ధములు బోధించు పోతవిగ్రహములయందు నమ్మిక యుంచుటవలన ప్రయోజన మేమి ?
కఱ్ఱనుచూచి మేలుకొమ్మనియు , మూగ రాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ ; అది ఏమైన బోధింపగలదా ? అది బంగారముతోను వెండితోను పూతపూయబడెను గాని దానిలో శ్వాసమెంత మాత్రమును లేదు .