ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినమునను
యెషయా 1:13

మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రక టనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నే నోర్చ జాలను.

యెషయా 1:14

మీ అమావాస్య ఉత్సవములును నియామక కాలము లును నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను.

2 రాజులు 4:23

అతడు నేడు అమావాస్య కాదే ; విశ్రాంతి దినముకాదే ; అతనియొద్దకు ఎందుకు పోవుదువని యడుగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి

కీర్తనల గ్రంథము 81:3

అమావాస్యనాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు కొమ్ము ఊదుడి .

కీర్తనల గ్రంథము 81:4

అది ఇశ్రాయేలీయులకు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము .

యెహెజ్కేలు 46:1

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా తూర్పుతట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము , పనిచేయు ఆరు దినములు మూయబడి యుండి , విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడియుండవలెను .

యెహెజ్కేలు 46:6

అమావాస్య నాడు నిర్దోషమైన చిన్న కోడెను నిర్దోషమైన ఆరు గొఱ్ఱెపిల్లలను నిర్దోషమైన యొక పొట్టేలును అర్పింపవలెను.

కొలొస్సయులకు 2:16

కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి.

కొలొస్సయులకు 2:17

ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది

సమస్త (శరీరులు )
కీర్తనల గ్రంథము 65:2

ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు

కీర్తనల గ్రంథము 86:9

ప్రభువా , దేవతలలో నీవంటివాడు లేడు నీ కార్యములకు సాటియైన కార్యములు లేవు .

జెకర్యా 8:20-23
20

సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా జనములును అనేక పట్టణముల నివాసులును ఇంకను వత్తురు .

21

ఒక పట్టణపువారు మరియొక పట్టణపువారి యొద్దకు వచ్చి ఆలస్యముచేయక యెహొవాను శాంతిపరచుటకును , సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును మనము పోదము రండి అని చెప్పగా వారుమేము ను వత్తుమందురు .

22

అనేక జనములును బలముగల జనులును యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును , యెహోవాను శాంతిపరచుటకును వత్తురు .

23

సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసి మంది యొక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వత్తుమని చెప్పుదురు .

జెకర్యా 14:14

యూదా వారు యెరూషలేమునొద్ద యుద్ధము చేయుదురు, బంగారును వెండియు వస్త్రములును చుట్టునున్న అన్యజను లందరి ఆస్తియంతయు విస్తారముగా కూర్చబడును .

జెకర్యా 14:16

మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరును సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేట వత్తురు.

మలాకీ 1:11

తూర్పుదిశ మొదలుకొని పడమటి దిశవరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచ బడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన యర్పణయును అర్పింపబడును, అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యోహాను 4:23

అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచ

ప్రకటన 15:4

ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారముచేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱెపిల్ల కీర్తనయు పాడుచున్నారు.