మరియు నీ జనులయెదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రముమధ్య పొడినేలను నడచిరి, ఒకడు లోతునీట రాయి వేసినట్లు వారిని తరిమినవారిని అగాధజలములలో నీవు పడవేసితివి.
తన బలమువలన ఆయన సముద్రమును రేపును తన వివేకమువలన రాహాబును పగులగొట్టును.
నీ బలముచేత సముద్రమును పాయలుగాచేసితివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగులగొట్టితివి.
పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు, సైన్యముల కధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.
ఆయన సైన్యములకధిపతియగు యెహోవా ; ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును , అందులోని నివాసు లందరును ప్రలాపింతురు , నైలునదివలెనే అదియంతయు ఉబుకుచుండును , ఐగుప్తుదేశపు నైలునదివలెనే అది అణగిపోవును .
ఆకాశమందు తనకొరకై మేడగదులు కట్టుకొనువాడును , ఆకాశమండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడును ఆయనే; ఆయన పేరు యెహోవా .
యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటి వాడు కాడు; ఆయన సమస్తమును నిర్మించువాడు, ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము; సైన్య ములకధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు.