చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరతురు హేయములని వాటిని పారవేయుదురు. లేచిపొమ్మని దానితో చెప్పుదురు.
మీకు మీరు పాపము కలుగజేసికొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతివాడును పారవేయును.
విగ్రహములు చేయువారు సిగ్గుపడినవారైరి వారందరు విస్మయము పొందియున్నారు. ఒకడును మిగులకుండ అందరు కలవరపడుదురు.
నీవు చేసినది అంతటినిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసికొందువు; ఇదే యెహోవా వాక్కు.
అప్పుడు మీరు మీ దుష్ ప్రవర్తనను మీరు చేసిన దుష్‌క్రియలను మనస్సునకు తెచ్చుకొని, మీ దోషములను బట్టియు హేయక్రియలను బట్టియు మిమ్మును మీరు అసహ్యించుకొందురు .
అష్షూరీయులచేత రక్షణ నొందగోరము , మేమికను గుఱ్ఱములను ఎక్కము -మీరే మాకు దేవుడని మేమికమీదట మా చేతి పనితో చెప్పము ; తండ్రిలేనివారి యెడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా.
ఎఫ్రాయిమూ బొమ్మలతో నాకిక నిమిత్తమేమి ? నేనే ఆలకించుచున్నాను , నేనే ఎఫ్రాయిమునుగూర్చి విచారణ చేయుచున్నాను, నేను చిగురుపెట్టు సరళవృక్షమువంటి వాడను, నావలననే నీకు ఫలము కలుగును .
అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను ? వాటినిగురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే ,
మస్తచావృక్షములను చూచి పచ్చని ప్రతిచెట్టు క్రిందను కామము రేపుకొనువారలారా, లోయలలో రాతిసందులక్రింద పిల్లలను చంపువారలారా,
తమ విగ్రహముల మధ్యను తాము కట్టిన బలిపీఠముల చుట్టును ఎత్తయిన కొండ లన్నిటి మీదను సకల పర్వతముల నడి కొప్పులమీదను పచ్చని చెట్లన్నిటి క్రిందను , పుష్టిపారిన మస్తకి వృక్షము లన్నిటి క్రిందను , తమ విగ్రహము లన్నిటికి పరిమళ ధూపమువేసిన చోటులన్నిటిలోను పడి వారి జనులు హతులై యుండు కాలమున నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు .
పర్వతముల శిఖరము లమీద బలులనర్పింతురు , కొండల మీద ధూపము వేయుదురు, సింధూరవృక్షముల క్రిందను చినారువృక్షముల క్రిందను మస్తకివృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే ధూపము వేయుదురు; అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి , మీ కోడండ్లును వ్యభిచారిణులైరి .
పూర్వ కాలమునుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసితినినేను సేవచేయనని చెప్పుచున్నావు; ఎత్తయిన ప్రతి కొండమీదను పచ్చని ప్రతి చెట్టుక్రిందను వేశ్యవలె క్రీడించుచున్నావు.
మరియు రాజైన యోషీయా దినములలో యెహోవా నాకీలాగు సెలవిచ్చెనుద్రోహినియగు ఇశ్రాయేలు చేయుకార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండమీదికిని పచ్చని ప్రతి చెట్టు క్రిందికిని పోవుచు అక్కడ వ్యభిచారము చేయుచున్నది.