యెహోవా, నీ కృప ఆకాశము నంటుచున్నది నీ సత్యసంధత్వము అంతరిక్షము నంటుచున్నది.
నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయవిధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే
ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించెదను.
క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడచుకొనును
మూర్ఖునికి జ్ఞానము అందదు గుమ్మమునొద్ద అట్టివారు మౌనులైయుందురు.
దేవుడైన యెహోవా ఇశ్రాయేలుయొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు.
ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు.
అప్పుడు యెహోవా నీవంటివాడెవడు? మించిన బలముగలవారి చేతినుండి దీనులను దోచుకొనువారి చేతినుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా యెముకలన్నియు చెప్పుకొనును.
యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు
కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు ? ఏ రూపమును ఆయనకు సాటిచేయగలరు ?
నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు ? అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు .
జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యము లన్నిటిలోను నీవంటివాడెవడును లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము.