Oh that men
కీర్తనల గ్రంథము 107:15

ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

కీర్తనల గ్రంథము 107:21

ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్య కార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

కీర్తనల గ్రంథము 107:31

ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్యకార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

కీర్తనల గ్రంథము 81:13-16
13

అయ్యో నా ప్రజలు నా మాట వినినయెడల ఇశ్రాయేలు నా మార్గముల ననుసరించినయెడల ఎంత మేలు!

14

అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును వారి విరోధులను కొట్టుదును.

15

యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతముగా నుండును.

16

అతిశ్రేష్ఠమైన గోధుమల ననుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును.

ద్వితీయోపదేశకాండమ 5:29

వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికుండిన మేలు.

ద్వితీయోపదేశకాండమ 32:29

వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు.

యెషయా 48:18

నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్ర తరంగములవలెను ఉండును.

praise
కీర్తనల గ్రంథము 34:3

నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము.

కీర్తనల గ్రంథము 92:1

యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా,

కీర్తనల గ్రంథము 92:2

నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతిరాత్రి నీ విశ్వాస్యతను

కీర్తనల గ్రంథము 147:1

యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రముచేయుట ఒప్పిదము.

యెషయా 63:7

యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానముచేతును. తన వాత్సల్యమునుబట్టియు కృపాబాహుళ్యమును బట్టియు ఇశ్రాయేలుయొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసెదను.

his wonderful
కీర్తనల గ్రంథము 40:5

యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటియైనవాడొకడును లేడు.

కీర్తనల గ్రంథము 78:4

యెహోవా స్తోత్రార్హక్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండ వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము.

కీర్తనల గ్రంథము 111:4

ఆయన తన ఆశ్చర్యకార్యములకు జ్ఞాపకార్థసూచనను నియమించియున్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు

దానియేలు 4:2

మహోన్నతుడగు దేవుడు నా యెడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను.

దానియేలు 4:3

ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి; ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము; ఆయన ఆధిపత్యము తర తరములు నిలుచుచున్నది.

దానియేలు 6:27

ఆయన విడిపించువాడును రక్షించువాడునైయుండి, పరమందును భూమిమీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను.