యెహోవా
కీర్తనల గ్రంథము 29:10

యెహోవా ప్రళయజలములమీద ఆసీనుడాయెను యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడైయున్నాడు.

కీర్తనల గ్రంథము 93:1

యెహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొనియున్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడియున్నది .

కీర్తనల గ్రంథము 145:13

నీ రాజ్యము శాశ్వతరాజ్యము నీ రాజ్యపరిపాలన తరతరములు నిలుచును.

కీర్తనల గ్రంథము 146:10

యెహోవా నిరంతరము ఏలును సీయోనూ, నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును

యెషయా 33:22

యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును.

యిర్మీయా 10:10

యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు.

విలాపవాక్యములు 5:19

యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై యుందువు నీ సింహాసనము తరతరములుండును.

దానియేలు 4:34

ఆ కాలము గడచిన పిమ్మట నెబుకద్నెజరను నేను మరల మానవబుద్ధిగలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి , చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రముచేసి ఘనపరచి స్తుతించితిని ; ఆయన ఆధిపత్యము చిరకాలమువరకు ఆయన రాజ్యము తర తరములకు నున్నవి.

దానియేలు 6:26

నా సముఖమున నియమించిన దేమనగానా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను . ఆయనే జీవముగల దేవుడు , ఆయనే యుగయుగములుండువాడు , ఆయన రాజ్యము నాశనము కానేరదు , ఆయన ఆధిపత్యము తుదమట్టున కుండును.

1 తిమోతికి 1:17

సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయుయుగయుగములు కలుగును గాక. ఆమేన్‌.

1 తిమోతికి 6:15

శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు.

1 తిమోతికి 6:16

సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌.

అన్యజనులు
కీర్తనల గ్రంథము 9:5

నీవు అన్యజనులను గద్దించి యున్నావు, దుష్టులను నశింపజేసియున్నావు వారి పేరు ఎన్నటికి నుండకుండ తుడుపు పెట్టియున్నావు.

కీర్తనల గ్రంథము 9:15

తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడియున్నది.

కీర్తనల గ్రంథము 18:43-45
43

ప్రజలు చేయు కలహములలో పడకుండ నీవు నన్ను విడిపించితివి నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు

44

నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు

45

అన్యులు నిస్త్రాణగలవారై వణకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు.

కీర్తనల గ్రంథము 44:2

నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్లగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి.

కీర్తనల గ్రంథము 44:3

వారు తమ ఖడ్గముచేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహువు వారికి జయమియ్యలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను.

కీర్తనల గ్రంథము 78:55

వారియెదుటనుండి అన్యజనులను వెళ్లగొట్టెను . కొలనూలుచేత వారి స్వాస్థ్యమును వారికి పంచియిచ్చెను . ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను .