
ఈ విషయములో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను.
ఆకాశమువైపు నిదానించి చూడుము నీ కన్న ఉన్నతమైన ఆకాశ విశాలములవైపు చూడుము.
నీవు పాపముచేసినను ఆయనకు నీవేమైన చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైన చేసితివా?
నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైన ఇచ్చుచున్నావా?ఆయన నీచేత ఏమైనను తీసికొనునా?
దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?
అయితే యెహోవా సమూయేలు తో ఈలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని యెత్తును లక్ష్య పెట్టకుము , మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు ; నేను అతని త్రోసివేసియున్నాను . మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును .
ముందుండినది బహుకాలముక్రిందనే తెలియబడెను; ఆయా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయెను; తమకంటె బలవంతుడైనవానితో వారు వ్యాజ్యెమాడజాలరు.
మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ . జిగటమన్ను దాని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అనదగునా ? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా?
చిరకాలము నిలుచు నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహమువలె వచ్చుచున్నారు, నిమిషములోనే నేను వారిని దాని యొద్దనుండి తోలివేయుదును, నేనెవని నేర్పరతునో వానిని దానిమీద నియమించెదను; నన్ను పోలియున్నవాడై నాకు ఆక్షేపణ కలుగచేయువాడేడి? నన్ను ఎదిరింపగల కాపరియేడి?
అవును గాని ఓ మనుష్యుడా , దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడవు ? నన్నెందు కీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా ?
ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనియెడల దేవుని యెదుట ధైర్యముగలవారమగుదుము.
ఆలోచించుడి నేను నా వ్యాజ్యెమును సరిచేసికొనియున్నాను నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియును.
నాతో వ్యాజ్యెమాడ చూచువాడెవడు?ఎవడైననుండిన యెడల నేను నోరుమూసికొని ప్రాణము విడిచెదను.
ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకుము అప్పుడు నేను నీకు విముఖుడనై యుండను.
నీ చెయ్యి నామీదనుండి తొలగింపుము నీ భయము నన్ను బెదరింపనీయకుము
అప్పుడు నీవు పిలిచిన యెడల నేను నీ కుత్తరమిచ్చెదను నేను పలికెదను నీవు నా కుత్తరమిమ్ము
నా దోషములెన్ని? నా పాపములెన్ని?నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయుము.
ఆయన నివాసస్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక.
ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యెమును విశదపరచెదను వాదములతో నా నోరు నింపుకొనెదను.
ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలిసికొందును ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును.
ఆయన తన అధికబలముచేత నాతో వ్యాజ్యెమాడునా?ఆయన ఆలాగు చేయక నా మనవి ఆలకించును
అప్పుడు యథార్ధవంతుడు ఆయనతో వ్యాజ్యెమాడవచ్చును.కావున నేను ఎన్నటికిని నా న్యాయాధిపతివలన శిక్షనొందకపోవుదును.
నీ సేవకునితో వ్యాజ్యెమాడకుము సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు.