నరుడు ఏపాటివాడు
యోబు గ్రంథము 9:2

వాస్తవమే, ఆ సంగతి అంతేయని నేనెరుగుదును.నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును?

యోబు గ్రంథము 14:4

పాపసహితునిలోనుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు?ఆలాగున ఎవడును పుట్టనేరడు.

యోబు గ్రంథము 25:4-6
4

నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు?స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడుకాగలడు?

5

ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు నక్షత్రములు పవిత్రమైనవి కావు.

6

మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగువంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా.

1 రాజులు 8:46

పాపము చేయనివాడు ఒకడును లేడు, వారు నీకు విరోధముగా పాపము చేసినయెడల నేమి, నీవు వారిమీద కోపగించుకొని వారిని శత్రువులచేతికి అప్పగించినయెడలనేమి, వారు వీరిని దూరమైనట్టి గాని దగ్గరయైనట్టి గాని ఆ శత్రువుల దేశములోనికి చెరగాకొనిపోయినప్పుడు

2 దినవృత్తాంతములు 6:36

పాపము చేయనివాడెవడును లేడు గనుక వారు నీ దృష్టి యెదుట పాపము చేసినప్పుడు నీవు వారిమీద ఆగ్రహించి, శత్రువుల చేతికి వారిని అప్పగింపగా, చెరపట్టు వారు వారిని దూరమైనట్టి గాని సమీపమైనట్టి గాని తమ దేశములకు పట్టుకొనిపోగా

కీర్తనల గ్రంథము 14:3

వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు

కీర్తనల గ్రంథము 51:5

నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.

సామెతలు 20:9

నా హృదయమును శుద్ధపరచుకొనియున్నాను పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిననుకొనదగినవాడెవడు?

ప్రసంగి 7:20

పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు.

ప్రసంగి 7:29

ఇది యొకటిమాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొనియున్నారు.

యోహాను 3:6

శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది.

రోమీయులకు 7:18

నా యందు , అనగా నా శరీర మందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును . మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని , దానిని చేయుట నాకు కలుగుట లేదు .

గలతీయులకు 3:22

యేసుక్రీస్తునందలి విశ్వాసమూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించువారికి అనుగ్రహింపబడునట్లు, లేఖనము అందరిని పాపములో బంధించెను.

ఎఫెసీయులకు 2:2

మీరు వాటిని చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి.

ఎఫెసీయులకు 2:3

వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.

1 యోహాను 1:8-10
8

మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్య ముండదు.

9

మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.

10

మనము పాపము చేయలేదని చెప్పుకొనినయెడల, ఆయనను అబద్ధికునిగా చేయువార మగుదుము; మరియు ఆయన వాక్యము మనలో ఉండదు.