shew thee
యోబు గ్రంథము 15:8

నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా?నీవు మాత్రమే జ్ఞానవంతుడవా?

యోబు గ్రంథము 15:11

దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగానున్నదా?ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలికగానున్నదా?

యోబు గ్రంథము 28:28

మరియు యెహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.

ద్వితీయోపదేశకాండమ 29:29

రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.

కీర్తనల గ్రంథము 25:14

యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గలవారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును.

దానియేలు 2:28

అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమం దున్నాడు, అంత్య దినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా

దానియేలు 2:47

మరియు రాజు -ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే; నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై యున్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చెను.

మత్తయి 13:35

అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధించెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు.

రోమీయులకు 16:25

సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనములద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారముగాను,

రోమీయులకు 16:26

యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును

1 కొరింథీయులకు 2:9-11
9

ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది.

10

మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.

11

ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు.

ఎఫెసీయులకు 3:5

ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులగు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి యున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియ పరచబడలేదు.

God exacteth
ఎజ్రా 9:13

అయితే మా దుష్క్రియలను బట్టియు మా గొప్ప అపరాధములను బట్టియు ఈ శ్రమలన్నియు మామీదికి వచ్చిన తరువాత, మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మామీద ఉంచి, మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి

కీర్తనల గ్రంథము 103:10

మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు.

కీర్తనల గ్రంథము 106:43-46
43

అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచువచ్చిరి. తమ దోషముచేత హీనదశనొందిరి.

44

అయినను వారిరోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను.

45

వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకముచేసికొనెను తన కృపాబాహుళ్యమునుబట్టి వారిని కరుణించెను.

46

వారిని చెరగొనిపోయిన వారికందరికి వారియెడల కనికరము పుట్టించెను.

విలాపవాక్యములు 3:22

యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము.