హేయక్రియలను అనుసరించి
2 దినవృత్తాంతములు 28:3

మరియు అతడు బెన్‌ హిన్నోము లోయయందు ధూపము వేసి ఇశ్రాయేలీయుల యెదుటనుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియలచొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను.

2 దినవృత్తాంతములు 36:14

అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులగువారు, అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై, యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరచిరి.

లేవీయకాండము 18:24-30
24

వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటివలన అపవిత్రులైరి.

25

ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్నవారిని వెళ్లగ్రక్కివేయుచున్నది.

26

కాబట్టి ఆ దేశము మీకంటె ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కివేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్లగ్రక్కి వేయకుండునట్లు మీరు,

27

అనగా స్వదేశియేగాని మీలో నివసించు పరదేశియేగాని యీ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక,

28

యీ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను.

29

ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలొనుండి కొట్టివేయబడుదురు.

30

కాబట్టి మీకంటె ముందుగానున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుటవలన అపవిత్రత కలుగజేసికొనకుండునట్లు నేను మీకు విధించిన విధి ననుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.

లేవీయకాండము 20:22

కాబట్టి మీరు నివసించునట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసికొని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటిని నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను.

లేవీయకాండము 20:23

నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములనుబట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నియు చేసిరి గనుక నేను వారియందు అసహ్య పడితిని.

ద్వితీయోపదేశకాండమ 12:31

తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు, ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతలపేరట తమ కూమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు గదా.

ద్వితీయోపదేశకాండమ 18:9

నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు.

ద్వితీయోపదేశకాండమ 18:14

నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘశకునములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆలాగున చేయనియ్యడు.

2 రాజులు 17:11

తమ యెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనులవాడుక చొప్పున ఉన్నతస్థలములలో ధూపము వేయుచు, చెడుతనము జరిగించుచు, యెహోవాకు కోపము పుట్టించి

2 రాజులు 17:15

వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను,ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైనదాని అనుసరించుచు, వ్యర్థులై వారి వాడుకలచొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టునున్న ఆ జనుల మర్యాదల ననుసరించి వారివంటివారైరి.

2 రాజులు 21:2

అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు, ఇశ్రాయేలీయులయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచు వచ్చెను.

2 రాజులు 21:9

ఇశ్రాయేలీయులయెదుట నిలువకుండ యెహోవా లయముచేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయునట్లు మనష్షే వారిని రేపెను.

ఎజ్రా 9:14

ఈ అసహ్యకార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసికొనినయెడల, మేము నాశనమగువరకు శేషమైనను లేకుండునట్లును, తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండునట్లును, నీవు కోపపడుదువు గదా.

కీర్తనల గ్రంథము 106:35-40
35

అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి.

36

వారి విగ్రహములకు పూజచేసిరి అవి వారికి ఉరి ఆయెను.

37

మరియు వారు తమ కూమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి.

38

నిరపరాధ రక్తము, అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి కనానుదేశపువారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి ఆ రక్తమువలన దేశము అపవిత్రమాయెను

39

తమ క్రియలవలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వ్యభిచరించినవారైరి.

40

కావున యెహోవా కోపము ఆయన ప్రజలమీద రగులుకొనెను ఆయన తనస్వాస్థ్యమందు అసహ్యపడెను.

యెహెజ్కేలు 11:12

అప్పుడు మీ చుట్టు నున్న అన్యజనుల విధుల నాచరించుటకై మీరు ఎవని కట్టడల ననుస రింపక మానితిరో యెవని విధులను ఆచరింప కపోతిరో, ఆ యెహోవానగు నేనే ఆయననని మీరు తెలిసికొందురు.