మరియు వారువారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తుదేశములోనుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి
తామెరుగని అన్యదేవతలను, ఆయన వారికి నియమింపని దేవతలను, పూజించి వాటికి నమస్కరించిరి
గనుక యీ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటిని యీ దేశముమీదికి తెప్పించుటకు దానిమీద యెహోవా కోపము రవులుకొనెను.
యెహోవా తన కోపోద్రేకముచేతను అత్యుగ్రతచేతను తమ దేశములో నుండి వారిని పెల్లగించి, నేడున్నట్లుగా వారిని వెళ్లగొట్టి పరదేశము పాలుచేసెను.
జనులు ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశమునుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి యితర దేవతలను అనుసరించి వాటికి పూజానమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించెనని ప్రత్యుత్తరమిచ్చెదరు.
కీత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలిసికొనుడి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనను జరిగినదా?
దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనెనా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేనిదానికై తమ మహిమను మార్చుకొనిరి.
ఆకాశమా, దీనిబట్టి విస్మయ పడుము, కంపించుము, బొత్తిగా పాడై పొమ్ము; ఇదే యెహోవా వాక్కు.
నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి యున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.
మన దేవుడైన యెహోవా దేనినిబట్టి ఇవన్నియు మాకు చేసెనని వారడుగగా నీవు వారితో ఈలాగనుముమీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్యదేవతలను కొలిచి నందుకు, మీదికాని దేశములో మీరు అన్యులను కొలిచె దరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
నీవు ఈ మాటలన్నియు ఈ ప్రజలకు తెలియ జెప్పిన తరువాత వారుదేనిబట్టి యెహోవా మాకు ఈ ఘోరబాధ అంతయు నియమించెను? మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి? మాపాపమేమి? అని నిన్నడుగగా
నీవు వారితో ఇట్లనుముయెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుమీ పితరులు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయుటను బట్టియే గదా వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి.
ఆలకించుడి; మీరందరు నా మాట వినకుండ కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు; మీరు మీ పితరులకంటె విస్తారముగా చెడుతనము చేసి యున్నారు.
కాబట్టి నేను మీయందు ఏమాత్రమును దయయుంచక, యీ దేశమునుండి మీరైనను మీ పితరు లైనను ఎరుగని దేశమునకు మిమ్మును వెళ్లగొట్టుచున్నాను; అక్కడ మీరు దివారాత్రము అన్యదేవతలను కొలుచుదురు.
కనుగొనినవారందరు వారిని భక్షించుచు వచ్చిరి వారి శత్రువులుమేము అపరాధులము కాము వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునగు యెహోవామీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించెనని చెప్పుదురు.
నీ శత్రువులందరు నిన్ను చూచి నోరు తెరచెదరు వారు ఎగతాళిచేసి పండ్లు కొరుకుచు దాని మింగివేసియున్నాము ఇదేగదా మనము కనిపెట్టినదినము అది తటస్థించెను, దాని మనము చూచియున్నాము అని యనుకొనెదరు.
యెహోవా తాను యోచించిన కార్యము ముగించి యున్నాడు పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చి యున్నాడు శేషములేకుండ నిన్ను పాడుచేసియున్నాడు నిన్నుబట్టి శత్రువులు సంతోషించునట్లు చేసి యున్నాడు నీ పగవారి శృంగమును హెచ్చించియున్నాడు.
దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములనుబట్టియు దాని యాజకుల దోషమునుబట్టియు
జనులు వీధులలో అంధులవలె తిరుగులాడెదరు వారు రక్తము అంటిన అపవిత్రులు ఎవరును వారి వస్త్రములను ముట్టకూడదు.
పొమ్ము అపవిత్రుడా, పొమ్ము పొమ్ము ముట్టవద్దని జనులు వారితో ననిరి. వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైన వారు ఇకను వారిక్కడ కాపురముండకూడదని చెప్పు కొనిరి
నర పుత్రుడా , ఇశ్రాయేలీ యులు తమ దేశము లో నివసించి , దుష్‌ప్రవర్తనచేతను దుష్‌క్రియలచేతను దానిని అపవిత్రపరచిరి , వారి ప్రవర్తన బహిష్టయైన స్త్రీయొక్క అపవిత్రతవలె నా దృష్టికి కనబడుచున్నది .
కాబట్టి దేశములో వారు చేసిన నరహత్య విషయమైయును , విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరచినదాని విషయమైయును నేను నా క్రోధమును వారిమీద కుమ్మరించి
వారి ప్రవర్తనను బట్టియు వారి క్రియలను బట్టియు వారిని శిక్షించి , నేను అన్యజనులలోనికి వారిని వెళ్లగొట్టగా వారు ఆ యా దేశములకు చెదరిపోయిరి .
వారు తాము వెళ్లిన స్థలములలోని జనులయొద్ద చేరగా ఆ జనులు వీరు యెహోవా జనులే గదా, ఆయన దేశములోనుండి వచ్చినవారే గదా, అని చెప్పుటవలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి.
నా హస్తమును యూదావారిమీదను యెరూషలేము నివాసులందరిమీదను చాపి, బయలుదేవత యొక్క భక్తులలో శేషించినవారిని, దానికి ప్రతిష్ఠితులగువారిని, దాని అర్చకులను నిర్మూలము చేసెదను.
మిద్దెలమీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరునుబట్టియు, బయలు దేవత తమకు రాజనుదాని నామమును బట్టియు మ్రొక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలము చేసెదను.
నా మందిరమును నేను విడిచియున్నాను, నా స్వాస్థ్యమును విసర్జించియున్నాను; నా ప్రాణప్రియురాలిని ఆమె శత్రువులచేతికి అప్పగించియున్నాను.
నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహమువంటిదాయెను; ఆమె నామీద గర్జించుచున్నది గనుక నేను ఆమెకు విరోధినైతిని.