మిఖాయేలు
దానియేలు 10:13

పారసీకుల రాజ్యా ధిపతి ఇరువది యొక్క దినములు నన్ను ఎదిరించెను. ఇంక పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానా ధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను,

దానియేలు 10:21

అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ యధిపతియగు మిఖాయేలు గాక యీ సంగతులనుగూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడును లేడు.

దానియేలు 12:1

ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.

ప్రకటన 12:7

అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా

ప్రధానదూతయైన
1 థెస్సలొనీకయులకు 4:16

ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

శరీరము
ద్వితీయోపదేశకాండమ 34:6

బెత్పయోరు యెదుట మోయాబు దేశము లోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి యెక్కడనున్నదో నేటివరకు ఎవరికి తెలియదు.

తెగింపక
నిర్గమకాండము 22:28

నీవు దేవుని నిందింపగూడదు, నీ ప్రజలలోని అధి కారిని శపింపకూడదు.

యెషయా 36:13-21
13

గొప్ప శబ్దముతో యూదాభాషతో ఇట్లనెను మహా రాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చునదేమనగా

14

హిజ్కియాచేత మోస పోకుడి; మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు.

15

యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును; ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కక పోవునని హిజ్కియా చెప్పుచున్నాడే.

16

హిజ్కియా చెప్పిన మాట మీరంగీకరింప వలదు; అష్షూరు రాజు సెలవిచ్చునదేమనగా నాతో సంధి చేసికొని నాయొద్దకు మీరు బయటికి వచ్చినయెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్షచెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు నుండును.

17

అటుపిమ్మట మీరు చావక బ్రదుకునట్లుగా నేను వచ్చి మీ దేశమువంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షారసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్షచెట్లునుగల దేశమునకును మిమ్మును తీసికొని పోదును; యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపుచ్చుచున్నాడు.

18

ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలోనుండి విడిపించెనా? హమాతు దేవత లేమాయెను?

19

అర్పాదు దేవతలేమాయెను? సెపర్వయీము దేవత లేమాయెను? షోమ్రోను దేశపు దేవత నా చేతిలోనుండి షోమ్రోనును విడిపించెనా?

20

యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించు ననుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును నా చేతిలోనుండి విడిపించినది కలదా? అని చెప్పెను.

21

అయితే అతనికి ప్రత్యుత్తర మియ్యవద్దని రాజు సెలవిచ్చి యుండుటచేత వారెంతమాత్రమును ప్రత్యుత్తర మియ్యక ఊరకొనిరి.

మార్కు 15:29

అప్పుడు ఆ మార్గమున వెళ్లుచున్నవారు తమ తలలూచుచు–ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా,

లూకా 23:39

వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచు–నీవు క్రీస్తువు గదా? నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మునుకూడ రక్షించుమని చెప్పెను.

లూకా 23:40

అయితే రెండవవాడు వానిని గద్దించి–నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా?

1 పేతురు 3:9

ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.

2 పేతురు 2:11

దేవదూతలు వారికంటె మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను, ప్రభువు ఎదుట వారిని దూషించి వారిమీద నేరము మోప వెరతురు.

ప్రభువు
1దినవృత్తాంతములు 12:17

దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెను మీరు సమాధానము కలిగి నాకు సహాయముచేయుటకై నాయొద్దకు వచ్చియున్నయెడల నా హృదయము మీతో అతికియుండును; అట్లుగాక నా వలన మీకు అపకారమేదియు కలుగలేదని యెరిగి యుండియు, నన్ను నా శత్రువులచేతికి అప్పగింపవలెనని మీరు వచ్చియున్నయెడల మన పితరులయొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించును గాక.

యెషయా 37:3

వీరు గోనెపట్ట కట్టుకొనినవారై అతనియొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి హిజ్కియా సెలవిచ్చునదేమనగా ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్ట వచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు.

యెషయా 37:4

జీవముగల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలనుబట్టి ఆయన అష్షూరురాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషముకొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము.

యెషయా 37:10-20
10

యూదా రాజగు హిజ్కియాతో ఈలాగు చెప్పుడి యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింప బడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవునిచేత మోస పోకుము.

11

అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా; నీవుమాత్రము తప్పించుకొందువా?

12

నా పితరులు నిర్మూలముచేసిన గోజానువారు గాని హారానువారు గాని రెజెపులు గాని తెలశ్శారులోనుండిన ఏదెనీయులు గాని తమ దేవతల సహాయమువలన తప్పించుకొనిరా?

13

హమాతు రాజు ఏమాయెను? అర్పాదు రాజును సెపర్వయీము హేన ఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి? అని వ్రాసిరి

14

హిజ్కియా దూతల చేతిలోనుండి ఆ ఉత్తరము తీసికొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి

15

యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థనచేసెను

16

యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యా కాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై యున్నావు.

17

సైన్యముల కధిపతివగు యెహోవా, చెవి యొగ్గి ఆలకించుము; యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము; జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము.

18

యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి

19

వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలముచేసిరి.

20

యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవావని సమస్త జనులు తెలిసికొనునట్లు అతని చేతిలోనుండి మమ్మును రక్షించుము.

జెకర్యా 3:2

సాతానూ, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలోనుండి తీసిన కొరవివలెనే యున్నాడుగదా అని యెహోవా దూత సాతానుతో అనెను.