నేను మిమ్మును ఏలను
న్యాయాధిపతులు 2:18

తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారికొరకు న్యాయాధిపతులను పుట్టించి, ఆయా న్యాయాధిపతులకు తోడైయుండి వారి దినములన్నిటను వారిశత్రువుల చేతులలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించెను.

న్యాయాధిపతులు 10:18

కాబట్టి జనులు, అనగా గిలాదు పెద్దలు అమ్మోనీయులతో యుద్ధముచేయ బూనుకొను వాడెవడో వాడు గిలాదు నివాసులకందరికిని ప్రధానుడగునని యొకనితో నొకడు చెప్పుకొనిరి.

న్యాయాధిపతులు 11:9-11
9

అందుకు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసికొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతి కప్పగించిన యెడల నేనే మీకు ప్రధానుడనవుదునా? అని గిలాదు పెద్దల నడుగగా

10

గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాటచొప్పున చేయుదుము; యెహోవా మన యుభయుల మధ్యను సాక్షిగా ఉండునుగాకని యెఫ్తాతో అనిరి.

11

కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతోకూడ పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతినిగాను అతని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి యంతయు వినిపించెను.

లూకా 22:24-27
24

తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా

25

ఆయన వారితో ఇట్లనెను అన్యజనములలో రాజులు వారిమీద ప్రభుత్వము చేయుదురు; వారిమీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు.

26

మీరైతే ఆలాగు ఉండరాదు; మీలో గొప్పవాడు చిన్నవానివలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను.

27

గొప్పవాడెవడు? భోజనపంక్తిని కూర్చుండువాడా పరిచర్యచేయువాడా? పంక్తినికూర్చుండు వాడే గదా? అయినను నేను మీ మధ్య పరిచర్యచేయు వానివలె ఉన్నాను.

2 కొరింథీయులకు 1:24

మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమైయున్నాము; విశ్వాసముచేతనే మీరు నిలుకడగా ఉన్నారు.

1 పేతురు 5:3

మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి;

యెహోవా
1 సమూయేలు 8:6

మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థనచేసెను .

1 సమూయేలు 8:7

అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా -జనులు నీతో చెప్పిన మాట లన్నిటి ప్రకారము జరిగింపుము ; వారు నిన్ను విసర్జింప లేదు గాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించియున్నారు .

1 సమూయేలు 10:19

అయినను మీ దుర్దశ లన్నిటిని ఉపద్రవము లన్నిటిని పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి -మామీద ఒకని రాజుగా నియమింపుమని ఆయనను అడిగియున్నారు . కాబట్టి యిప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలెను.

1 సమూయేలు 12:12

అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే , మీ దేవుడైన యెహోవా మీకు రాజైయున్నను -ఆయన కాదు , ఒక రాజు మిమ్మును ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి .

యెషయా 33:22

యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును.

యెషయా 63:19
నీ పరిపాలన నెన్నడును ఎరుగనివారివలెనైతివిు నీ పేరెన్నడును పెట్టబడనివారివలెనైతివిు.