
యేసు వారితో ఇట్లనెనుఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి.
అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.
ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను.
యేసు వారితో ఇట్లు చెప్పసాగెను ఎవడును మిమ్మును మోసపుచ్చకుండ చూచుకొనుడి.
అనేకులు నా పేరట వచ్చినేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు.
మిమ్మునుగూర్చి మీరే జాగ్రత్తపడుడి. వారు మిమ్మును సభల కప్పగించెదరు; మిమ్మును సమాజమందిరములలో కొట్టించెదరు; మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల యెదుటను రాజుల యెదుటను నా నిమిత్తము నిలువబడెదరు.
మీరు జాగ్రత్తగా ఉండుడి; ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి యున్నాను.
ఆయన మీరు మోసపోకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనననియు, కాలము సమీపించెననియు చెప్పుదురు; మీరు వారి వెంబడిపోకుడి.
మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు,
నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.
వ్యర్థముగానే యిన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థమగునా?
మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను.
సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి.
అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్త లేదనియు, నేను పడిన కష్టము నిష్‌ప్రయోజనము కాలేదనియు క్రీస్తుదినమున నాకు అతిశయకారణము కలుగును
అయినను ఇప్పటివరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకొందము .
అయితే మీరు వెలిగింపబడినమీదట, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపుదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి.
కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును.
నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.
బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు . నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.
విత్తువాడును కోయువాడును కూడ సంతోషించునట్లు, కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థ మైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు.
నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును.
పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చుకొనును.
అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను;