కొండెములాడువారు భూమిమీద స్థిరపడకుందురుగాక ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయును గాక.
సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.
అటువలె పరిచర్యచేయు స్త్రీలును మాన్యులై కొండెములు చెప్పనివారును, మితాను భవముగలవారును, అన్నివిషయములలో నమ్మకమైనవారునై యుండవలెను.
అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు
ఆలాగుననే వృద్ధస్త్రీలు కొండెకత్తెలును,మిగుల మద్యపానాసక్తులునై యుండక, ప్రవర్తనయందు భయభక్తులుగలవారై యుండవలెననియు, దేవునివాక్యము దూషింపబడకుండునట్లు,
ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల
మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.
మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును.
తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు;
కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా , నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేనివిషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు ; ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా?
తినువాడు తిననివాని తృణీకరింప కూడదు , తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు ; ఏలయనగా దేవు డతనిని చేర్చుకొనెను .
పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు ? అతడు నిలిచియుండుటయైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును , ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు .
అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల ? నీ సహోదరుని నిరాకరింప నేల ? మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము.
నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును ,ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు
అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను .
కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చువరకు, దేనిని గూర్చియు తీర్పుతీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతివానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.
కాబట్టి యేమందుము ? ధర్మశాస్త్రము పాపమాయెనా ? అట్లనరాదు . ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును . ఆశింప వద్దని ధర్మశాస్త్రము చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును .
కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది , ఆజ్ఞకూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై యున్నది.
ఉత్తమమైనది నాకు మరణకర మాయెనా ? అట్లనరాదు . అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు , పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాప మగు నిమిత్తము, అది నాకు మరణకర మాయెను .
మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునైయుండుడి.
ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు.
అయితే స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.
ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు.