లేఖన మేమి చెప్పుచున్నది ? అబ్రాహాము దేవుని నమ్మెను , అది అతనికి నీతిగా ఎంచబడెను
మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను నేను నీ యందు నా బలము చూపుటకును , నా నామము భూలోక మందంతట ప్రచురమగుటకును , అందు నిమిత్తమే నిన్ను నియమించితిని.
ఏమనగా , ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గు పడడని లేఖనము చెప్పుచున్నది .
తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింప లేదు . ఏలీయాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా ?
దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజను లందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను.
ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా?
నూర్చెడియెద్దు మూతికి చిక్కము వేయకూడదు.
కళ్లము త్రొక్కుచున్న యెద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది. దేవుడు ఎడ్లకొరకు విచారించుచున్నాడా?
కేవలము మనకొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మనకొరకే గదా యీ మాట వ్రాయబడెను? ఏలయనగా, దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్లము త్రొక్కించువాడు పంటలో పాలుపొందుదునను ఆశతో త్రొక్కింపవలెను.
నీ పొరుగువాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు, కూలివాని కూలి మరునాటి వరకు నీయొద్ద ఉంచుకొనకూడదు;
నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటికూలి ఆ నాడియ్యవలెను.
సూర్యుడు అస్తమింపకమునుపు వానికియ్యవలెను. వాడు బీదవాడు గనుక దానిమీద ఆశ పెట్టుకొనియుండును. వాడు నిన్నుబట్టి యెహోవాకు మొఱ్ఱపెట్టునేమో అది నీకు పాపమగును.
పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా?
వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ యింటిలోనే యుండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇంటింటికి తిరుగవద్దు.