న్యాయాధిపతులను
ద్వితీయోపదేశకాండమ 1:15-17
15

కాబట్టి బుద్ధికలిగి ప్రసిద్ధులైన మీ మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని, మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై వెయ్యిమందికి ఒకడును, నూరుమందికి ఒకడును ఏబదిమందికి ఒకడును, పదిమందికి ఒకడును వారిని, మీమీద నేను నియమించితిని.

16

అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యెములను తీర్చి, ప్రతి మనుష్యునికిని వాని సహోదరునికిని వానియొద్దనున్న పరదేశికిని న్యాయమునుబట్టి మీరు తీర్పు తీర్చవలెను.

17

తీర్పు తీర్చునప్పుడు అల్పుల సంగతి గాని ఘనుల సంగతి గాని పక్షపాతములేకుండ వినవలెను; న్యాయపుతీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠినవ్యాజ్యెమును నాయొద్దకు తీసికొని రావలెను; నేను దానిని విచారించెదనని వారి కాజ్ఞాపించితిని.

ద్వితీయోపదేశకాండమ 17:9

నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్లి యాజకులైన లేవీయులను ఆ దినములలో నుండు న్యాయాధిపతిని విచారింపవలెను. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజెప్పుదురు.

ద్వితీయోపదేశకాండమ 17:12

మరియు నెవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనేగాని ఆ న్యాయాధిపతి మాటనేగాని విననొల్లనియెడల వాడు చావవలెను. అట్లు చెడుతనమును ఇశ్రాయేలీయులలోనుండి పరిహరింపవలెను.

ద్వితీయోపదేశకాండమ 19:17

ఆ వివాదముగల ఇద్దరు మనుష్యులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలములోనున్న యాజకుల యెదుటను న్యాయాధిపతుల యెదుటను నిలువవలెను.

ద్వితీయోపదేశకాండమ 19:18

ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధసాక్ష్యమై తన సహోదరునిమీద వాడు అబద్ధసాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడియైన యెడల, వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయవలెను.

ద్వితీయోపదేశకాండమ 21:2

నీ పెద్దలును నీ న్యాయాధిపతులును వచ్చి చంపబడినవాని చుట్టునున్న పురముల దూరము కొలిపింపవలెను.

నిర్గమకాండము 18:25

ఇశ్రాయేలీయులందరిలో సామర్థ్యముగల మనుష్యులను ఏర్పరచుకొని, వెయ్యిమందికి ఒకనిగాను, నూరుమందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పదిమందికి ఒకనిగాను, న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజలమీద ప్రధానులనుగా నియమించెను.

నిర్గమకాండము 18:26

వారెల్లప్పుడును ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యెములను మోషేయొద్దకు తెచ్చుచు, స్వల్ప వ్యాజ్యెములను తామే తీర్చుచువచ్చిరి.

నిర్గమకాండము 21:6

వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసికొనిరావలెను, మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొనిపోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైయుండును.

1దినవృత్తాంతములు 23:4

వీరిలో ఇరువది నాలుగువేలమంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను,ఆరు వేలమంది అధిపతులుగాను, న్యాయాధిపతులుగాను ఉండిరి.

1దినవృత్తాంతములు 26:29

ఇస్హారీయులనుగూర్చినదివారిలో కెనన్యాయును వాని కుమారులును బయటిపని జరిగించుటకై ఇశ్రాయేలీయులకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడిరి.

2 దినవృత్తాంతములు 19:5-11
5

మరియు అతడు ఆయా పట్టణములలో, అనగా దేశమందు యూదా వారున్న బురుజులుగల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారి కీలాగున ఆజ్ఞాపించెను

6

మీరు యెహోవా నియమమునుబట్టియే గాని మనుష్యుల నియమమునుబట్టి తీర్పు తీర్చవలసినవారు కారు; ఆయన మీతో కూడ నుండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి.

7

యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పు తీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు,ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు.

8

మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును, సందేహాంశములను పరిష్కరించుటకును, యెహోషాపాతు లేవీయులలోను యాజకులలోను ఇశ్రాయేలీయుల పితరుల యిండ్ల పెద్దలలోను కొందరిని నియమించి

9

వారికీలాగున ఆజ్ఞాపించెను యెహోవాయందు భయభక్తులు కలిగినవారై, నమ్మకముతోను యథార్థమనస్సుతోను మీరు ప్రవర్తింపవలెను.

10

నరహత్యను గూర్చియు, ధర్మశాస్త్రమును గూర్చియు, ధర్మమును గూర్చియు, కట్టడలను గూర్చియు, న్యాయవిధులను గూర్చియు,ఆయాపట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినేగాని మీరు విమర్శించునప్పుడు, మీమీదికిని మీ సహోదరులమీదికిని కోపము రాకుండునట్లు వారు యెహోవాదృష్టికి ఏ అపరాధమును చేయకుండ వారిని హెచ్చరిక చేయవలెను; మీరాలాగు చేసినయెడల అపరాధులు కాకయుందురు.

11

మరియు ప్రధానయాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీమీద ఉన్నాడు, యూదా సంతతివారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడునగు జెబద్యా రాజు సంగతుల విషయములో పైవాడుగా ఉన్నాడు, లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలుచేయుటకై యెహోవా మీతో కూడ ఉండును.

కీర్తనల గ్రంథము 82:2

ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పుతీర్చుదురు ? ఎంతకాలము భక్తిహీనులయెడల పక్షపాతము చూపుదురు?(సెలా.)

కీర్తనల గ్రంథము 82:3

పేదలకును తలిదండ్రులులేనివారికిని న్యాయము తీర్చుడి శ్రమగలవారికిని దీనులకును న్యాయము తీర్చుడి .

రోమీయులకు 13:1-6
1

ప్రతి వాడును పై అధికారులకు లోబడియుండవలెను ; ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ; ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి యున్నవి .

2

కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు ; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు .

3

ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు ; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు ; వారికి భయ పడక ఉండ కోరితివా , మేలు చేయుము , అప్పుడు వారిచేత మెప్పు పొందుదువు .

4

నీవు చెడ్డది చేసిన యెడల భయపడుము , వారు ఊరకయే ఖడ్గము ధరింపరు ; కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు .

5

కాబట్టి ఆగ్రహభయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము .

6

ఏలయనగా వారు దేవుని సేవకులై యుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు.