వాడు
యోహాను 11:25

అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;

యోహాను 11:26

బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను.

యోహాను 5:21

తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును.

యోహాను 5:25

మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

యోహాను 10:30

నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.

ఆదికాండము 1:3

దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.

1 సమూయేలు 2:6

జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయే పాతాళమునకు పంపుచు అందులోనుండి రప్పించుచుండువాడు ఆయనే.

కీర్తనల గ్రంథము 33:9

ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను.

యెహెజ్కేలు 37:3-10
3

ఆయన నర పుత్రుడా , యెండిపోయిన యీ యెముకలు బ్రదుకగలవా ? అని నన్న డుగగా ప్రభువా యెహోవా అది నీకే తెలియునని నేనంటిని .

4

అందుకాయన ప్రవచన మెత్తి యెండిపోయిన యీ యెముకలతో ఇట్లనుము ఎండిపోయిన యెముకలారా , యెహోవా మాట ఆలకించుడి .

5

ఈ యెముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను ;

6

చర్మము కప్పి మీకు నరముల నిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీమీద కప్పెదను ; మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రదుకుదురు ; అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు .

7

ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని యొకటి పుట్టెను ; అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను .

8

నేను చూచుచుండగా నరములును మాంసమును వాటిమీదికి వచ్చెను , వాటిపైన చర్మము కప్పెను , అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేక పోయెను .

9

అప్పడు ఆయన నరపుత్రుడా; జీవాత్మవచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా జీవాత్మా, నలుదిక్కులనుండివచ్చి హతులైన వీరు బ్రదుకునట్లు వారిమీద ఊపిరి విడువుము.

10

ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను; వారు సజీవులై లేచి లెక్కింప శక్యముకాని మహా సైన్యమై నిలిచిరి.

హొషేయ 13:14

అయినను పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును ; మృత్యువు నుండి వారిని రక్షింతును . ఓ మరణమా , నీ విజయ మెక్కడ? ఓ మరణమా , నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు .

అపొస్తలుల కార్యములు 20:9-12
9

అప్పుడు ఐతుకు అను నొక ¸యవనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలసేవు ప్రసంగించుచుండగా నిద్రాభారమువలన జోగి, మూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయినవాడై

10

అంతట పౌలు క్రిందికి వెళ్లి అతనిమీద పడి కౌగిలించుకొనిమీరు తొందరపడకుడి, అతని ప్రాణమతనిలో నున్నదని వారితో చెప్పెను.

11

అతడు మరల పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని, తెల్లవారువరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను.

12

వారు బ్రదికిన ఆ చిన్నవానిని తీసికొనివచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను.

ఫిలిప్పీయులకు 3:21

సమస్తమును తనకు లోపరచు కొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును .

ప్రకటన 1:18

నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.

కట్టబడినవాడై
యోహాను 20:5

వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు.

యోహాను 20:7

నారబట్టలు పడియుండుటయు, ఆయన తల రుమాలు నార బట్టలయొద్ద ఉండక వేరుగా ఒకటచోట చుట్టిపెట్టియుండుటయు చూచెను.

(విప్పిపోనియ్యుడని/విప్పి)
యోహాను 11:39

యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్తప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను.

మార్కు 5:43

జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను.

లూకా 7:15

ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను.