
నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు .
పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లాడును మిడినాగు పుట్టమీద పాలువిడిచిన పిల్ల తన చెయ్యి చాచును
నర పుత్రుడా , నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్లతుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు ;
పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకర మైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను.
అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి, యే హానియు పొందలేదు.
సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును . మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.
నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు .
గాని మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశిం పదు .
ఇట్లుండగా ఏమందుము ? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి యెవడు ?
తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయన తో పాటు సమస్తమును మన కెందుకు అనుగ్రహింపడు ?
దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడెవడు ? నీతిమంతులుగా తీర్చు వాడు దేవుడే ;
శిక్ష విధించువాడెవడు ? చనిపోయిన క్రీస్తుయేసే ; అంతే కాదు , మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే
క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు ? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా ?
ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దిన మెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱలమని మేము ఎంచబడినవారము .
అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటి లో అత్యధిక విజయము పొందుచున్నాము.
మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను ,
మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.
ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొంది యుండుడి.నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.
కాబట్టి ప్రభువు నాకుసహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.
ఎవడైనను వారికి హానిచేయ నుద్దేశించినయెడల వారి నోటనుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హానిచేయ నుద్దేశించినయెడల ఆలాగున వాడు చంపబడవలెను.