దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున
బాధ చేతను ఇనుప కట్లచేతను బంధింపబడినవారై చీకటిలోను మరణాంధకారములోను నివాసముచేయువారి హృదయమును
ఆయన ఆయాసముచేత క్రుంగజేసెను . వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను .
కష్టకాలమందు వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను
వారి కట్లను తెంపివేసి చీకటిలోనుండియు మరణాంధకారములో నుండియు వారిని రప్పించెను .
గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీ గృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును
యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను.
నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.
చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీమీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది
జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.
నా శత్రువా , నామీద అతిశయింప వద్దు , నేను క్రిందపడినను , తిరిగి లేతును ; నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును.
తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు .
మన పాదములను సమాధాన మార్గము లోనికి నడిపించునట్లు చీకటి లోను మరణ చ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమునుబట్టి పై నుండి ఆయన మనకు అరుణోదయ దర్శన మనుగ్రహించెను .
నీ రక్షణ నేనుకన్నులార చూచితిని.
చీకటియు గాఢాంధకారమును మరల దానిని తమ యొద్దకు తీసికొనును గాక.మేఘము దాని కమ్మును గాక పగలును కమ్మునట్టి అంధకారము దాని బెదరించును గాక
కటికచీకటియై గాఢాంధకారమయమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలుగే చీకటిగాగల దేశమునకు నేను వెళ్లక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము.
దుష్‌క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటియైనను మరణాంధకారమైనను లేదు.
అయితే నక్కలున్నచోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు గాఢాంధకారముచేత మమ్మును కప్పియున్నావు
ఆయన చీకటి కమ్మజేయక మునుపే, మీ కాళ్లు చీకటి కొండలకు తగులకమునుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయకమునుపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి.
ఆయన సప్తఋషీ నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు , కారు చీకటిని ఉదయముగా మార్చువాడు , పగటిని రాత్రి చీకటివలె మార్పుచేయువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు .