ఎఫ్రాయిము
హొషేయ 5:12

ఎఫ్రాయిమీయులకు చిమ్మట పురుగువలెను యూదా వారికి వత్సపురుగువలెను నేనుందును.

హొషేయ 5:14

ఏలయనగా ఎఫ్రాయిమీయులకు సింహమువంటివాడనుగాను యూదా వారికి కొదమ సింహమువంటివాడనుగాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనిపోవుదును, విడిపించువాడొకడును లేకపోవును

హొషేయ 8:8

ఇశ్రాయేలువారు తినివేయబడుదురు; ఎవరికిని ఇష్టము కాని ఘటమువంటివారై అన్యజనులలో నుందురు.

హొషేయ 9:11-17
11

ఎఫ్రాయిముయొక్క కీర్తి పక్షివలె ఎగిరిపోవును; జననమైనను, గర్భముతో ఉండుటయైనను, గర్భము ధరించుటయైనను వారికుండదు.

12

వారు తమ పిల్లలను పెంచి నను వారికి ఎవరును లేకుండ అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసెదను; నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును.

13

లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని; అయితే నరహంతకుల కప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును.

14

యెహోవా, వారికి ప్రతికారము చేయుము; వారికి నీవేమి ప్రతికారము చేయుదువు? వారి స్త్రీలను గొడ్రాండ్రు గాను ఎండు రొమ్ములు గల వారినిగాను చేయుము.

15

వారి చెడుతన మంతయు గిల్గాలులో కనబడుచున్నది; అచ్చటనే నేను వారికి విరోధినైతిని, వారి దుష్ట క్రియలను బట్టి వారి నికను ప్రేమిం పక నా మందిరములోనుండి వారిని వెలివేతును; వారి యధిపతు లందరును తిరుగుబాటు చేయువారు.

16

ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫల మియ్యరు. వారు పిల్లలు కని నను వారి గర్భనిధిలోనుండివచ్చు సొత్తును నేను నాశనము చేసెదను.

17

వారు నా దేవుని మాటల నాలకించ లేదు గనుక ఆయన వారిని విసర్జించెను. వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు.

హొషేయ 11:5

ఐగుప్తు దేశము నకు వారు మరల దిగిపోరు గాని నన్ను విసర్జించి నందున అష్షూరు రాజు వారిమీద ప్రభుత్వము చేయును.

హొషేయ 11:6

వారు చేయుచున్న యోచనలనుబట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును; అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మింగివేయును.

హొషేయ 13:1-3
1

ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయము కలిగెను; అతడు ఇశ్రాయేలువారిలో తన్ను గొప్ప చేసికొనెను; తరువాత బయలు దేవతనుబట్టి అపరాధియై అతడు నాశనమొందెను.

2

ఇప్పుడు వారు పాపము పెంపుచేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయుదురు, అదంతయు పనివారు చేయు పనియే, వాటికి బలులను అర్పించు వారు దూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పుదురు.

3

కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘమువలెను పెందలకడ గతించు ప్రాతఃకాలపు మంచువలె నుందురు; కళ్లములోనుండి గాలి యెగురగొట్టు పొట్టువలెను, కిటకీలోగుండ పోవు పొగవలె నుందురు.

హొషేయ 13:15-3
హొషేయ 13:16-3
యోబు గ్రంథము 12:14

ఆలోచించుము ఆయన పడగొట్టగా ఎవరును మరలకట్టజాలరు ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికిని సాధ్యము కాదు.

యెషయా 28:1-4
1

త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటమునకు శ్రమ వాడిపోవుచున్న పుష్పమువంటివారి సుందర భూషణమునకు శ్రమ ద్రాక్షారసమువలన కూలిపోయినవారి ఫలవంతమైన లోయ తలమీదనున్న కిరీటమునకు శ్రమ.

2

ఆలకించుడి, బలపరాక్రమములు గలవాడొకడు ప్రభువుకు ఉన్నాడు ప్రచండమైన వడగండ్లును ప్రచండమైన జలముల ప్రవాహమును ప్రచండమైన వరదయు కొట్టివేయునట్లు ఆయన తన బలముచేత పడద్రోయువాడు.

3

త్రాగుబోతులగు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటము కాళ్లతో త్రొక్కబడును.

4

ఫలవంతమైన లోయ తలమీదనున్న వాడిపోవు పుష్పమువంటిదాని సుందరభూషణము వసంతకాలము రాకమునపు పండిన మొదటి అంజూరపు పండువలె అగును దాని కనుగొనువాడు దాని చూడగానే అది వాని చేతిలో పడినవెంటనే అది మింగివేయబడును.

ఆమోసు 3:14

ఇశ్రాయేలువారు చేసిన దోషములనుబట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షింతును; ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేల రాలును.

ఆమోసు 3:15

చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టెదను, దంతపు నగరులును లయమగును, బహు నగరులు పాడగును; ఇదే యెహోవా వాక్కు.

ఆమోసు 7:9
ఇస్సాకు సంతతివారు ఏర్పరచిన ఉన్నతస్థలములు పాడైపోవును, ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితస్థలములు నాశమగును. నేను ఖడ్గము చేత పట్టుకొని యరొబాము ఇంటి వారిమీద పడుదును.
ఆమోసు 7:17
యెహోవా సెలవిచ్చునదేమనగా -నీ భార్య పట్టణమందు వేశ్యయగును, నీ కూమారులును కుమార్తెలును ఖడ్గముచేత కూలుదురు, నీ భూమి నూలుచేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు; అవశ్యముగా ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి చెరగొనబడుదురు.
జరుగబోవు
యెషయా 46:10

నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.

యెషయా 48:3

పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలకాలముక్రిందట తెలియజేసితిని ఆ సమాచారము నా నోటనుండి బయలుదేరెను నేను వాటిని ప్రకటించితిని నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించెను.

యెషయా 48:5

నా విగ్రహము ఈ కార్యములను జరిగించెననియు నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము దీని నియమించెననియు నీవు చెప్పకుండునట్లు పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియజేసితిని అది జరు గకమునుపే దానిని నీకు ప్రకటించితిని

ఆమోసు 3:7

తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.

జెకర్యా 1:6

అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలును కట్టడలును మీ పితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి-మన ప్రవర్తననుబట్టియు క్రియలనుబట్టియు యెహోవా మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసియున్నాడని చెప్పుకొనిరి.

యోహాను 16:4

అవి జరుగుకాలము వచ్చినప్పుడు నేను వాటినిగూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొనులాగున యీ సంగతులు మీతో చెప్పుచున్నాను; నేను మీతో కూడ ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు.