ఒక ప్రవక్తద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తుదేశములోనుండి రప్పించెను, ప్రవక్తద్వారా వారిని కాపాడెను.
హొషేయ 13:4

మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినది మొదలుకొని యెహోవా నగు నేనే మీ దేవుడను ; నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు , నేను తప్ప రక్షకుడును లేడు .

హొషేయ 13:5

మహా యెండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించినవాడను నేనే .

నిర్గమకాండము 12:50

ఇశ్రాయేలీయులందరు ఆలాగు చేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి.

నిర్గమకాండము 12:51

యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెను.

నిర్గమకాండము 13:3

మోషే ప్రజలతో నిట్లనెను మీరు దాసగృహమైన ఐగుప్తునుండి బయలుదేరివచ్చిన దినమును జ్ఞాపకముచేసికొనుడి. యెహోవా తన బాహుబలముచేత దానిలోనుండి మిమ్మును బయటికి రప్పించెను; పులిసినదేదియు తినవద్దు.

1 సమూయేలు 12:8

యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవా కు మొఱ్ఱపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులోనుండి తోడుకొని వచ్చి యీ స్థలమందు నివసింపజేసిరి .

కీర్తనల గ్రంథము 77:20
మాషే అహరోనులచేత నీ ప్రజలను మందవలె నడి పించితివి.
యెషయా 63:11
అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జను లను జ్ఞాపకము చేసికొనెను. తన మందకాపరులకు సహకారియై సముద్రములో నుండి తమ్మును తోడుకొనివచ్చినవాడేడి?
యెషయా 63:12
తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి? మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చినవాడేడి?
ఆమోసు 2:11

మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను , మీ ¸యౌవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించితిని . ఇశ్రాయేలీయు లారా , యీ మాటలు నిజమైనవికావా ? ఇదే యెహోవా వాక్కు .

ఆమోసు 2:12

అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి , ప్రవచింప వద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి .

మీకా 6:4

ఐగుప్తు దేశములోనుండి నేను మిమ్మును రప్పించితిని , దాస గృహములోనుండి మిమ్మును విమోచించితిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని .

అపొస్తలుల కార్యములు 3:22

మోషే యిట్లనెను ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను.

అపొస్తలుల కార్యములు 3:23

ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.

అపొస్తలుల కార్యములు 7:35-37
35

అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించినవాడెవడని వారు నిరాకరించిన యీ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను

36

ఇతడు ఐగుప్తులోను ఎఱ్ఱసముద్రములోను నలువది ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచకక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను.

37

నావంటి యొక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే యితడే.