ఆ దినములను గూర్చిన దర్శనమును వివరించియున్నాను . అది వాస్తవము , అది యనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును; నీవైతే ఈ దర్శనము వెల్లడిచేయకుమనెను .
పారసీక రాజగు కోరెషు పరిపాలన కాలములో మూడవ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను ; గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే ; దానియేలు దాని గ్రహించెను ; అది దర్శనమువలన అతనికి తెలిసిన దాయెను.
అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను , మీ యధిపతియగు మిఖాయేలు గాక యీ సంగతులనుగూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడును లేడు.
ఆలోచనయు తెలివియుగల శ్రేష్ఠమైన సామెతలు నేను నీకొరకు రచించితిని.
తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు .
లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడలనేను దేవుని కుమారుడనని చెప్పినందుకు,
అందుకు పిలాతు నీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసం
అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు;
అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు -ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు -ఈ మాటలు నమ్మకమును నిజమునైయున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు.
మరియు పారసీకదేశపు రాజైన కోరెషుయొక్క దినములన్నిటిలోను పారసీకదేశపు రాజైన దర్యావేషుయొక్క పరిపాలనకాలమువరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి.
మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదాదేశస్థులను గూర్చియు యెరూషలేము పట్టణపువారిని గూర్చియు ఉత్తరము వ్రాసి వారిమీద తప్పు మోపిరి.
అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని, దక్షిణదేశపు రాజు తో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరచి , తన మనస్సును రేపుకొనును గనుక దక్షిణదేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహా బలముగలవాడై యుద్ధమునకు సిద్ధపడును . అతడు దక్షిణ దేశపురాజునకు విరోధమైన ఉపాయములు చేయ నుద్దేశించినందున ఆ రాజు నిలువ లేకపోవును .
రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది , అది యొక పార్శ్వముమీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్కటెముకలను పట్టుకొనినది. కొందరులెమ్ము , విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి .
ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని . ఇట్లు జరుగగా దానిని ఎదిరించుటకైనను , అది పట్టకుండ తప్పించుకొనుటకైనను , ఏ జంతువునకును శక్తిలేకపోయెను ; అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చెను.