మరియు నామీద తిరుగబడువారిని దోషము చేయువారిని మీలో ఉండకుండ ప్రత్యేకించెదను , తాము కాపురమున్న దేశము లోనుండి వారిని రప్పించెదను గాని నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లు వారు ఇశ్రాయేలు దేశము లో ప్రవేశిం చరు .
ఇశ్రాయేలీయులారా, మీ దుర్మార్గతనుబట్టియు మీ కాని చేష్టలనుబట్టియు కాక నా నామమునుబట్టియే నేను మీ కీలాగున చేయగా నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.
యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును, అతడు చేసినదంతటి ప్రకారము మీరును చేయుదురు, ఇది సంభవించునప్పుడు నేను ప్రభువైన యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.
ఇట్లు నేను నీ సంగీతనాదమును మాన్పించెదను, నీ సితారానాద మికను వినబడదు,
అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును , వారి యెదుట మీయందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలిసికొందురు ; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు .
నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసికొనునట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి యెదుట నన్ను తెలియపరచుకొందును .
వారు పూర్ణహృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారి కిచ్చెదను.
నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్నడును యెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాప ములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు.
అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.
మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్య వంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.
కాగా నీవు ఈ మాట ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ యా జనముల మధ్యనుండి నేను మిమ్మును సమకూర్చి , మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మును రప్పించి , ఇశ్రాయేలు దేశమును మీ వశము చేసెదను .
వారు అక్కడికి వచ్చి అక్కడ తాముంచియున్న విగ్రహములను తీసివేసి , తాము చేసియున్న హేయక్రియలు చేయుట మానుదురు.
వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనునట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి , వారికి ఏక మనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టింతును .
అప్పుడు వారు నాకు జనులై యుందురు నేను వారికి దేవుడనై యుందును .
ఆ యా జనులలోనుండి వాటిని తోడుకొని వచ్చి, ఆ యా దేశములలోనుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశము లోనికి వాటిని తెచ్చి పర్వతములమీదను వాగులయొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను.
నేను అన్యజనుల లోనుండి మిమ్మును తోడుకొని , ఆ యా దేశములలో నుండి సమకూర్చి , మీ స్వదేశము లోనికి మిమ్మును రప్పించెదను .
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఏయే అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయిరో ఆ యా అన్యజనులలోనుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటనుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొనివచ్చి
మీ పితరులు నివసించునట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు, వారి పిల్లలును వారి పిల్లల పిల్లలును అక్కడ నిత్యము నివసింతురు, నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతియై యుండును.