a despised
యిర్మీయా 48:38

మోయాబు ఇంటి పైకప్పులన్నిటిమీదను దాని వీధులలోను అంగలార్పు వినబడుచున్నది ఒకడు పనికిమాలిన ఘటమును పగులగొట్టునట్లు నేను మోయాబును పగులగొట్టుచున్నాను ఇదే యెహోవా వాక్కు.

1 సమూయేలు 5:3-5
3

అయితే మరునాడు అష్డోదువారు ప్రాతఃకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడియుండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వానిస్థానమందు మరల ఉంచిరి .

4

ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడియుండెను . దాగోనుయొక్క తలయు రెండు అరచేతులును తెగవేయబడి గడప దగ్గర పడియుండెను, వాని మొండెము మాత్రము వానికి మిగిలి యుండెను.

5

కాబట్టి దాగోను యాజకు లేమి దాగోను గుడికి వచ్చు వారేమి నేటివరకు ఎవరును అష్డోదులో దాగోనుయొక్క గుడి గడపను త్రొక్కుటలేదు .

2 సమూయేలు 5:21

ఫలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి.

కీర్తనల గ్రంథము 31:12

మరణమై స్మరణకు రాకున్న వానివలె మరువబడితిని ఓటికుండవంటి వాడనైతిని.

హొషేయ 8:8

ఇశ్రాయేలువారు తినివేయబడుదురు ; ఎవరికిని ఇష్టము కాని ఘటమువంటివారై అన్యజనులలో నుందురు .

హొషేయ 13:15

నిజముగా ఎఫ్రాయిము తన సహోదరు లలో ఫలాభివృద్ధినొందును . అయితే తూర్పుగాలి వచ్చును , యెహోవా పుట్టించు గాలి అరణ్యములోనుండి లేచును ; అది రాగా అతని నీటిబుగ్గలు ఎండిపోవును , అతని ఊటలు ఇంకిపోవును , అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువు లన్నిటిని శత్రువు కొల్లపెట్టును .

రోమీయులకు 9:21-23
21

ఒక ముద్ద లోనుండియే యొక ఘటము ఘనత కును ఒకటి ఘనహీనత కును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా ?

22

ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును , తన ప్రభావమును చూపుటకును, ఇచ్చ యించినవాడై, నాశనము నకు సిద్ధపడి ఉగ్రతా పాత్రమైన ఘటములను ఆయన బహు ధీర్ఘశాంతము తో సహించిన నేమి ?

23

మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణా పాత్ర ఘటములయెడల, అనగా యూదుల లోనుండి మాత్రము కాక ,

2 తిమోతికి 2:20

గొప్పయింటిలో వెండి పాత్రలును బంగారు పాత్రలును మాత్రమే గాక కఱ్ఱవియు మంటివియు కూడ ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును.

2 తిమోతికి 2:21

ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్ర పరచుకొనినయెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును.

his seed
యిర్మీయా 22:30

యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడుసంతానహీనుడనియు, తన దినములలో వర్ధిల్లనివాడనియు ఈ మనుష్యునిగూర్చి వ్రాయుడి; అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు; ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా నుండడు.

1దినవృత్తాంతములు 3:17-24
17

యకొన్యా కుమారులు అస్సీరు షయల్తీయేలు

18

మల్కీరాము పెదాయా షెనజ్జరు యెకమ్యా హోషామా నెదబ్యా.

19

పెదాయా కుమారులు జెరుబ్బాబెలు షిమీ; జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము హనన్యా; షెలోమీతు వారికి సహోదరి.

20

హషుబా ఓహెలు బెరెక్యా హసద్యా యూషబెస్హెదు అను మరి యయిదుగురుండిరి.

21

హనన్యా కుమారులు పెలట్యా యెషయా, రెఫాయా కుమారులును అర్నాను కుమారులును ఓబద్యా కుమారులును షెకన్యా కుమారులును.

22

షెకన్యా కుమారులలో షెమయా అను ఒకడుండెను; షెమయా కుమారులు ఆరుగురు. హట్టూషు ఇగాలు బారియహు నెయర్యా షాపాతు.

23

నెయర్యా కుమారులు ముగ్గురు. ఎల్యోయేనై హిజ్కియా అజ్రీకాము;

24

ఎల్యోయేనై కుమారులు ఏడుగురు; హోదవ్యా ఎల్యాషీబు పెలాయా అక్కూబు యోహానాను దెలాయ్యా అనాని.

మత్తయి 1:12-16
12

బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను;

13

జెరుబ్బాబెలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను;

14

అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను;

15

ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను;

16

యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను.

which
యిర్మీయా 14:18

పొలములోనికి నేను పోగా ఖడ్గముచేత హతులైనవారు కనబడుదురు, పట్టణములో ప్రవేశింపగా క్షామపీడితులు అచ్చట నుందురు; ప్రవక్తలేమి యాజకులేమి తామెరుగని దేశమునకు పోవలెనని ప్రయాణమైయున్నారు.