neither do
ఆదికాండము 2:2

దేవుడు తాను చేసిన తనపని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పని యంతటినుండి యేడవ దినమున విశ్రమించెను.

ఆదికాండము 2:3

కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించి నట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను.

నిర్గమకాండము 16:23-29
23

అందుకు అతడు–యెహోవా చెప్పిన మాట యిది; రేపు విశ్రాంతిదినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతిదినము, మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి. ఉదయమువరకు మిగిలిందంతయు మీ కోరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను.

24

మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయము వరకు దానిని ఉంచుకొనిరి, అది కంపుకొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు.

25

మోషే–నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతిదినము, నేడు అది బయట దొరకదు.

26

ఆరు దినములు దాని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా ఏడవ దినమున అది దొరకదనెను.

27

అట్లు జరిగెను; ప్రజలలో కొందరు ఏడవ దినమున దాని కూర్చుకొన వెళ్లగా వారికేమియు దొరకకపోయెను.

28

అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను–మీరు ఎన్నాళ్లవరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు?

29

చూడుడి నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతిదినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక ఆరవ దినమున రెండు దినముల ఆహారము మీ కనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచియుండవలెను. ఏడవ దినమున ఎవడును తన చోటనుండి బయలు వెళ్లకూడదనెను.

నిర్గమకాండము 20:8-10
8

విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము.

9

ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను

10

ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయకూడదు.

నిర్గమకాండము 23:12

ఆరు దినములు నీ పనులు చేసి, నీ యెద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించునట్లు ఏడవ దినమున ఊరక యుండవలెను.

నిర్గమకాండము 31:13-17
13

మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలిసికొనునట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును.

14

కావున మీరు విశ్రాంతిదినము నాచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము; దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల లోనుండి కొట్టివేయబడును.

15

ఆరు దినములు పనిచేయవచ్చును; ఏడవ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతిదినము. ఆ విశ్రాంతిదినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నొందును.

16

ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను; అది నిత్యనిబంధన.

17

నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడును గురుతైయుండును; ఏలయనగా ఆరుదినములు యెహోవా భూమ్యాకాశములను సృజించి యేడవదినమున పని మాని విశ్రమించెనని చెప్పుము.

లేవీయకాండము 19:3

మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరింపవలెను; నేను మీ దేవుడనైన యెహోవాను.

లేవీయకాండము 23:3

ఆరు దినములు పనిచేయవలెను; వారము వారము ఏడవ దినము విశ్రాంతిదినము; అది పరిశుద్ధసంఘపు దినము. అందులో మీరు ఏ పనియైనను చేయకూడదు. మీ సమస్త నివాసములయందు అది యెహోవా నియమించిన విశ్రాంతిదినము.

ద్వితీయోపదేశకాండమ 5:12-15
12

నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము.

13

ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను.

14

ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ యెద్దయినను నీ గాడిదయైనను నీ పశువులలో ఏదైనను నీ యిండ్లలోనున్న పరదేశియైనను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీవలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను.

15

నీవు ఐగుప్తుదేశమందు దాసుడవైయున్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలముచేతను చాచిన చేతిచేతను నిన్ను అక్కడనుండి రప్పించెనని జ్ఞాపకము చేసికొనుము. అందుచేతను విశ్రాంతిదినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను.

యెషయా 56:2-6
2

నేను నియమించిన విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండ తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు.

3

యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలోనుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండుడు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు.

4

నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుచు నాకిష్టమైనవాటిని కోరుకొనుచు నా నిబంధన నాధారము చేసికొనుచున్న షండులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

5

నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చెదను కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను

6

విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను

యెషయా 58:13

నా విశ్రాంతిదినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన యెడల విశ్రాంతిదినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితదినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించినయెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినయెడల

యెహెజ్కేలు 20:12

మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలిసికొనునట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని.

యెహెజ్కేలు 20:20

నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలిసికొనునట్లు ఆ విశ్రాంతిదినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండును.

యెహెజ్కేలు 20:21

అయినను ఆ జనులు సహా నా మీద తిరుగబడి, తామనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన నా కట్టడలను అనుస రింపకయు, నా విధులను గైకొన కయు, నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచిరి గనుక, వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి నా కోపము వారిమీద తీర్చుకొందునని యనుకొంటిని.

యెహెజ్కేలు 22:8

నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు, నా విశ్రాంతిదినములను నీవు అపవిత్రపరచుచున్నావు.

లూకా 6:5

కాగా–మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును యజమానుడని వారితో చెప్పెను.

లూకా 23:56

తిరిగి వెళ్లి, సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి, ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి.

ప్రకటన 1:10

ప్రభువు దినమందు ఆత్మ వశుడనైయుండగా బూరధ్వనివంటి గొప్పస్వరము