
నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకముచేసికొనుము.నా కన్ను ఇకను మేలు చూడదు.
అతని యవనదినములను తగ్గించియున్నావు. సిగ్గుతో అతని కప్పియున్నావు (సెలా.)
యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును?
నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకముచేసికొనుము ఎంత వ్యర్థముగా నీవు నరులనందరిని సృజించియున్నావు?
నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి గడ్డివలె నేను వాడియున్నాను.
నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నాబలము క్రుంగజేసెను నా దినములు కొద్దిపరచెను.
నేనీలాగు మనవిచేసితిని నా దేవా, నాదినముల మధ్యను నన్ను కొనిపోకుము నీ సంవత్సరములు తరతరములుండును.
ద్రాక్షతోటలోని గుడిసెవలెను దోసపాదులలోని పాకవలెను ముట్టడివేయబడిన పట్టణమువలెను సీయోను కుమార్తె విడువబడియున్నది.
అది మరెన్నడును నివాసస్థలముగా నుండదు తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు గొఱ్ఱలకాపరులు తమ మందలను అక్కడ పరుండనియ్యరు
నా దినములు నేతగాని నాడెకంటెను వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమైపోవుచున్నవి.
పరుగుమీద పోవువానికంటె నా దినములు త్వరగా గతించుచున్నవి క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి.
రెల్లుపడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును ఎరమీదికి విసురున దిగు పక్షిరాజువలె అవి త్వరపడిపోవును.
పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును.
రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.
ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసివచ్చెను.ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడియున్నవి.నేను పండుకొనునప్పుడెల్ల
ఎప్పుడు లేచెదనా? రాత్రి యెప్పుడు గతించునా? అని యనుకొందును.తెల్లవారువరకు ఇటు ఆటు పొరలుచు ఆయాసపడుదును.
నా దేహము పురుగులతోను మంటి పెల్లలతోను కప్పబడియున్నది.నా చర్మము మాని మరల పగులుచున్నది.
నా ప్రాణము సమసిపోయెను నా దినములు తీరెను సమాధి నా నిమిత్తము సిద్ధమైయున్నది.
భీతిచెందినవాడనై నీకు కనబడకుండ నేను నాశనమైతిననుకొంటిని అయినను నీకు నేను మొఱ్ఱపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించితివి.
అధికారులు నాకు విరోధముగా సభతీర్చి మాటలాడుకొందురు నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును.