
ప్రాణము పోవుచున్నవానికి మద్యము నియ్యుడి మనోవ్యాకులముగలవారికి ద్రాక్షారసము నియ్యుడి.
హృదయ పూర్వకముగా నన్ను బతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు; నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావలెనని వారు గుంపులు కూడుదురు .
ఆహా , యెహోవా దినము వచ్చెనే అది ఎంత భయంకరమైన దినము ! అది ప్రళయమువలెనే సర్వశక్తుని యొద్దనుండి వచ్చును .
క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది ద్రాక్షావల్లి క్షీణించుచున్నది సంతోషహృదయులందరు నిట్టూర్పు విడుచుచున్నారు. తంబురల సంతోషనాదము నిలిచిపోయెను
ఉల్లసించువారి ధ్వని మానిపోయెను సితారాల యింపైన శబ్దము నిలిచిపోయెను.
పాటలు పాడుచు మనుష్యులు ద్రాక్షారసము త్రాగరు పానము చేయువారికి మద్యము చేదాయెను
భూమి తట్టు తేరి చూడగా బాధలును అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును; వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు.
సైన్యములకధిపతియగు యెహోవా ఉగ్రతవలన దేశము కాలిపోయెను. జనులును అగ్నికి కట్టెలవలె నున్నారు వారిలో ఒకనినొకడు కరుణింపడు.
ఫలభరితమైన పొలములోనుండియు మోయాబు దేశములోనుండియు ఆనందమును సంతోషమును తొలగిపోయెను ద్రాక్షగానుగలలో ద్రాక్షారసమును లేకుండ చేయుచున్నాను జనులు సంతోషించుచు త్రొక్కరు సంతోషము నిస్సంతోషమాయెను.
పెద్దలు గుమ్మములయొద్ద కూడుట మానిరి ¸యవనులు సంగీతము మానిరి.
సంతోషము మా హృదయమును విడిచిపోయెను నాట్యము దుఃఖముగా మార్చబడియున్నది.
దేవుడును సైన్యములకధిపతియునైన ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా - నేను మీ మధ్య సంచరింపబోవుచున్నాను గనుక రాజమార్గము లన్నిటిలో అంగలార్పు వినబడును, వీధు లన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు ; అంగలార్చు టకు వారు సేద్యగాండ్రను పిలుతురు ; రోదనముచేయ నేర్పుగలవారిని అంగలార్చు టకు పిలిపింతురు.
ద్రాక్షతోట లన్నిటిలో రోదనము వినబడును.
యెహోవా దినము రావలెనని ఆశపెట్టు కొనియున్న వారలారా, మీకు శ్రమ ; యెహోవా దినము వచ్చుటవలన మీకు ప్రయోజనమేమి ? అది వెలుగు కాదు , అంధకారము .
ఒకడు సింహము నొద్దనుండి తప్పించుకొనగా ఎలుగుబంటి యెదురైనట్టు , వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరచినట్టు ఆ దినముండును.
యెహోవా దినము నిజముగా వెలుగై యుండదు కాదా ? వెలుగు ఏమాత్రమును లేక అది కారుచీకటిగా ఉండదా?
రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లివస్త్రము ధరించుకొనని యొకని చూచి
–స్నేహితుడా, పెండ్లి వస్త్రములేక ఇక్కడి కేలాగు వచ్చితి వని అడుగగా వాడు మౌనియై యుండెను.
అంతట రాజు–వీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను.
అందుకు అబ్రాహాము - కుమారుడా , నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి , ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము ; ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు , నీవు యాతన పడుచున్నావు .