ఏమైరి?
యెషయా 5:21

తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ యెన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకొనువారికి శ్రమ.

యెషయా 47:10-13
10

నీ చెడుతనమును నీవు ఆధారము చేసికొని యెవడును నన్ను చూడడని అనుకొంటివి నేనున్నాను నేను తప్ప మరి ఎవరును లేరని నీవనుకొనునట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను .

11

కీడు నీమీదికి వచ్చును నీవు మంత్రించి దాని పోగొట్ట జాలవు ఆ కీడు నీమీద పడును దానిని నీవు నివారించ లేవు నీకు తెలి యని నాశనము నీమీదికి ఆకస్మికముగా వచ్చును .

12

నీ బాల్యమునుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనము లగునేమో ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతు వేమో

13

నీ విస్తారమైన యోచనలవలన నీవు అలసియున్నావు జ్యోతిష్కులు నక్షత్రసూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి నీమీదికి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము.

న్యాయాధిపతులు 9:38

జెబులు అతనితో ఆహాహా మనము అతని సేవింపవలసినందుకు అబీమెలెకు ఎవడనిన నీమాట యేమాయెను? ఇది నీవు తృణీకరించిన జనము కాదా? పోయి వారితో యుద్ధము చేయుడనగా

యిర్మీయా 2:28

నీకు నీవు చేసికొనిన దేవతలు ఎక్కడ నున్నవి? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించు నేమో; యూదా, నీ పట్టణములెన్నో నీ దేవతలన్నియే గదా.

1 కొరింథీయులకు 1:20

జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు తర్కవాది యేమయ్యెను? ఈ లోకజ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా?

వారు గ్రహించి
యెషయా 40:13

యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు ? ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచినవాడెవడు ? ఎవనియొద్ద ఆయన ఆలోచన అడిగెను?

యెషయా 40:14

ఆయనకు వివేకము కలుగజేసినవాడెవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పినవాడెవడు ? ఆయనకు జ్ఞానమును ఆభ్యసింపజేసినవాడెవడు ? ఆయనకు బుద్ధి మార్గము బోధించినవాడెవడు ?

యెషయా 41:22

జరుగబోవువాటిని విశదపరచి మాయెదుట తెలియ జెప్పుడి పూర్వమైనవాటిని విశదపరచుడి మేమాలోచించి వాటి ఫలమును తెలిసికొనునట్లు వాటిని మాకు తెలియజెప్పుడి లేనియెడల రాగలవాటిని మాకు తెలియజెప్పుడి .

యెషయా 41:23

ఇకమీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము మేము ఒకరినొకరము సాటిచేసికొని కనుగొనునట్లు మేలైనను కీడైనను చేయుడి.

యెషయా 44:7

ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు ? అట్టివాడెక్కడైన నుండినయెడల నాకు తెలియజెప్ప వలెను ఆ సంగతి నాకు ప్రచురింపవలెను అట్టివారు భవిష్యద్విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పువారై యుండవలెను.

యోబు గ్రంథము 11:6

ఆయనే జ్ఞానరహస్యములు నీకు తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలిసికొందువు నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయియున్నాడని తెలిసికొనుము.

యోబు గ్రంథము 11:7

దేవుని గూఢాంశములను నీవు తెలిసికొనగలవా?సర్వశక్తుడగు దేవునిగూర్చి నీకు పరిపూర్ణజ్ఞానముకలుగునా?

రోమీయులకు 11:33
ఆహా , దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము ; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు ; ఆయన మార్గములెంతో అగమ్యములు .
రోమీయులకు 11:34
ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు ? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు ?