భక్తిహీనుల యింటిమీదికి యెహోవా వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును.
భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతిమంతుల యిల్లు నిలుచును.
నీతిమంతుడైనవాడు భక్తిహీనుని యిల్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును.
అతడు తన యింటిమీద ఆనుకొనగా అది నిలువదు.
భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును.లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును
వారి ఆశ్రయమైన వారి గుడారములోనుండి పెరికివేయబడుదురు వారు భీకరుడగు రాజునొద్దకు కొనిపోబడుదురు.
వారికి అన్యులైనవారు వారి గుడారములో నివాసముచేయుదురు వారి నివాసస్థలముమీద గంధకము చల్లబడును.
నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును దేవుని ఎరుగనివారి స్థలము ఇట్టిది.
వారి ధననిధులు అంధకారపూర్ణములగును ఊదనక్కరలేని అగ్ని వారిని మింగివేయును వారి గుడారములో మిగిలినదానిని అది కాల్చివేయును.
ఆకాశము వారి దోషమును బయలుపరచును భూమి వారిమీదికి లేచును.
వారి యింటికివచ్చిన ఆర్జన కనబడకపోవును దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును.
అధిపతుల మందిరము ఎక్కడనున్నది?భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరడుగుచున్నారే.
దేవునివలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది ఇది బాధించువారు సర్వశక్తునివలన పొందు స్వాస్థ్యము
వారి పిల్లలు విస్తరించినయెడల అది ఖడ్గముచేత పడుటకే గదా వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు.
వారికి మిగిలినవారు తెగులువలన చచ్చి పాతిపెట్టబడెదరు వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి.
ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగుచేసినను జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకొనినను
వారు దాని సిద్ధపరచుకొనుటయే గాని నీతిమంతులు దాని కట్టుకొనెదరు నిరపరాధులు ఆ వెండిని పంచుకొనెదరు.
పురుగుల గూళ్లవంటి యిండ్లు వారు కట్టుకొందురు కావలివాడు కట్టుకొను గుడిసెవంటి యిండ్లు వారు కట్టుకొందురు.
వారు ధనముగలవారై పండుకొందురు గాని మరల లేవరు కన్నులు తెరవగానే లేకపోవుదురు.
భయములు జలప్రవాహములవలె వారిని తరిమి పట్టుకొనును రాత్రివేళ తుఫాను వారిని ఎత్తికొనిపోవును.
ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు - నేనే దాని బయలుదేరజేయుచున్నాను; అది దొంగల యిండ్లలోను, నా నామమునుబట్టి అబద్ధప్రమాణము చేయువారి యిండ్లలోను ప్రవేశించి వారి యిండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును.
మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూల బడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.
ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకువలె వృద్ధినొందుదురు
విలువగల ధనమును నూనెయు జ్ఞానుల యింటనుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును.
నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైనయెడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధిల్లజేయును.