నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది.
మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు.
నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను.
దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము
భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడును వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును .
యెరూష లేమా, నీవు రక్షింపబడునట్లు నీ హృదయములోనుండి చెడుతనము కడిగివేసికొనుము, ఎన్నాళ్లవరకు నీ దుష్టాభి ప్రాయములు నీకు కలిగియుండును?
అందరు ఒకరితో నొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సుగలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు.
యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును.
వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడువరకు అది వాని దృష్టియెదుట వాని ముఖస్తుతి చేయుచున్నది.
వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధిగలిగి ప్రవర్తింపను మేలుచేయను వాడు మానివేసియున్నాడు.
వాడు మంచముమీదనే పాపయోచనను యోచించును వాడు కానినడతలు నడచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు.
ఒకడు నన్ను చూడవచ్చినయెడల వాడు అబద్ధమాడును వాని హృదయము పాపమును పోగుచేసికొనుచున్నది. వాడు బయలువెళ్లి వీధిలో దాని పలుకుచున్నాడు.
నన్ను ద్వేషించువారందరు కూడి నామీద గుసగుసలాడుచున్నారు నశింపజేయవలెనని వారు నాకు కీడుచేయ నాలోచించుచున్నారు.
యెహోవా, దుష్టుల చేతిలోనుండి నన్ను విడిపింపుము బలాత్కారము చేయువారి చేతిలో పడకుండ నన్ను కాపాడుము.
వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు వారు నిత్యము యుద్ధము రేప జూచుచుందురు.
పాము నాలుకవలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవులక్రింద సర్పవిషమున్నది. (సెలా.)
హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి.
కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమ కూర్చిక్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.
అందుకు వారుయూదయ బేత్లెహేములోనే; ఏల యనగాయూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు;ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధి
అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి,
ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొని
మీరు వెళ్లి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి,ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను.
యేసును మాయోపాయముచేత పట్టుకొని, చంపవలెనని యేకమై ఆలోచన చేసిరి.
కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చువరకు, దేనిని గూర్చియు తీర్పుతీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతివానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.
అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, అవమానకరమైన రహస్యకార్యములను విసర్జించియున్నాము