అతనికిచ్చెను
నిర్గమకాండము 24:12

అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు కొండయెక్కి నాయొద్దకు వచ్చి అచ్చటనుండుము; నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతిపలకలను నీకిచ్చెదననగా

నిర్గమకాండము 24:18

అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండమీదికి ఎక్కెను. మోషే ఆ కొండమీద రేయింబవళ్ళు నలుబది దినములుండెను.

నిర్గమకాండము 32:15

మోషే శాసనములుగల రెండు పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను . ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి ; అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడియుండెను .

నిర్గమకాండము 32:16

ఆ పలకలు దేవుడు చేసినవి ; ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత .

నిర్గమకాండము 34:1-4
1

మరియు యెహోవా మోషే తో మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము . నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద నున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను .

2

ఉదయమునకు నీవు సిద్ధ పడి ఉదయమున సీనాయి కొండ యెక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచియుండవలెను .

3

ఏ నరుడును నీతో ఈ కొండకు రా కూడదు ; ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడనైనను కనబడ కూడదు ; ఈ కొండ యెదుట గొఱ్ఱలైనను ఎద్దులైనను మేయ కూడదని సెలవిచ్చెను.

4

కాబట్టి అతడు మొదటి పలకలవంటి రెండు రాతి పలకలను చెక్కెను . మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించి నట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ రెండు రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ యెక్కగా

నిర్గమకాండము 34:28-4
నిర్గమకాండము 34:29-4
ద్వితీయోపదేశకాండమ 4:13

మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను, అనగా పది ఆజ్ఞలను మీకు తెలియజేసి రెండు రాతి పలకలమీద వాటిని వ్రాసెను.

ద్వితీయోపదేశకాండమ 5:22

ఈ మాటలను యెహోవా ఆ పర్వతముమీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్యనుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి, రెండు రాతి పలకలమీద వాటిని వ్రాసి నాకిచ్చెను. ఆయన మరేమియు చెప్పలేదు.

ద్వితీయోపదేశకాండమ 9:9-11
9

ఆ రాతిపలకలు, అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసికొనుటకు నేను కొండెక్కినప్పుడు, అన్నపానములు మాని ఆ కొండమీద నలువది పగళ్లు నలువది రాత్రులుంటిని.

10

అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన రెండు రాతి పలకలను యెహోవా నాకప్పగించెను. మీరు కూడివచ్చిన దినమున ఆ కొండమీద అగ్ని మధ్యనుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నియు వాటిమీద ఉండెను.

11

ఆ నలువది పగళ్లు నలువది రాత్రులు గడచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ రెండు రాతిపలకలను నాకప్పగించి

2 కొరింథీయులకు 3:3

రాతిపలకమీదగాని సిరాతోగాని వ్రాయబడక, మెత్తని హృదయములు అను పలకలమీద జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్యమూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై యున్నారని మీరు తేటపరచబడుచున్నారు.

వ్రేలితో
నిర్గమకాండము 8:19

శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారిమాట వినకపోయెను.

నిర్గమకాండము 32:16

ఆ పలకలు దేవుడు చేసినవి ; ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత .

యిర్మీయా 31:33

ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.

మత్తయి 12:28

దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి యున్నది.

లూకా 11:20

అయితే నేను దేవుని వ్రేలి తో దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది .

2 కొరింథీయులకు 3:7

మరణ కారణమగు పరిచర్య, రాళ్లమీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను, మహిమతో కూడినదాయెను. అందుకే మోషే ముఖముమీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను,ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరిచూడలేక పోయిరి.

2 కొరింథీయులకు 3:8

ఇట్లుండగా ఆత్మసంబంధమైన పరిచర్య యెంత మహిమగలదై యుండును?