నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైన ఉద్దేశించినయెడల, నా యేలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద నున్న జీవపు మూటలో కట్టబడును ; ఒకడు వడిసెలతో రాయి విసరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరివేయును .
దుష్టులును దేవుని మరచు జనులందరును పాతాళమునకు దిగిపోవుదురు.
అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుటవలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరుతెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసినయెడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియుననెను.
అతడు ఆ మాటలన్నియు చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను.
భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను.
వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళములో కూలిరి; భూమి వారిని మింగివేసెను; వారు సమాజములో ఉండకుండ నశించిరి.
యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును ; యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును ; రేపు నీవును నీ కుమారులును నాతోకూడ ఉందురు అని సౌలుతో చెప్పగా
నర పుత్రుడా , అల్లరిచేయు ఐగుప్తీయుల సమూహమును గూర్చి అంగలార్చుము , ప్రసిద్ధినొందిన జనముల కుమార్తెలు భూమి క్రిందికి దిగిపోయినట్లు భూమి క్రిందికిని పాతాళమునకు పోయిన వారి యొద్దకును వారిని పడవేయుము .
సౌందర్యమందు నీవు ఎవనిని మించిన వాడవు? దిగి సున్నతి నొందని వారియొద్ద పడియుండుము .
ఖడ్గముచేత హతమైన వారిమధ్య వారు కూలుదురు , అది కత్తి పాలగును , దానిని దాని జనులను లాగి పడవేయుడి.
వారు దిగిపోయిరే , సున్నతినొందని వీరు ఖడ్గముచేత హతమై అక్కడ పడియుండిరే , అని యందురు; పాతాళములోనున్న పరాక్రమశాలురలో బలాఢ్యులు దాని గూర్చియు దాని సహాయులనుగూర్చియు అందురు .
అష్షూరును దాని సమూహ మంతయు అచ్చటనున్నవి , దాని చుట్టును వారి సమాధులున్నవి , వారందరు కత్తి పాలై చచ్చియున్నారు .
దాని సమాధులు పాతాళాగాధములో నియమింపబడినవి , దాని సమూహము దాని సమాధి చుట్టు నున్నది , వారందరు సజీవుల లోకములో భయంకరులైన వారు, వారు కత్తి పాలై చచ్చిపడియుండిరి .
అక్కడ ఏలామును దాని సమూహమును సమాధి చుట్టు నున్నవి; అందరును కత్తి పాలై చచ్చిరి ; వారు సజీవుల లోకములో భయంకరులైనవారు , వారు సున్నతిలేనివారై పాతాళము లోనికి దిగిపోయిరి , గోతిలోనికి దిగిపోయిన వారితో కూడ వారు అవమానము నొందుదురు .
హతులైన వారిమధ్య దానికిని దాని సమూహమునకును పడకయొకటి ఏర్పడెను , దాని సమాధులు దానిచుట్టు నున్నవి; వారందరును సున్నతిలేనివారై హతులైరి ; వారు సజీవుల లోకములో భయంకరులు గనుక గోతిలోనికి దిగిపోయినవారితో కూడ వారును అవమానము నొందుదురు , హతులైన వారిమధ్య అది యుంచబడును .
అక్కడ మెషెకును తుబాలును దాని సమూహమును ఉన్నవి; దాని సమాధులు దాని చుట్టునున్నవి . వారందరు సున్నతిలేనివారు , సజీవుల లోకములో వారు భయంకరు లైరి గనుక వారు కత్తిపాలైరి , ఆయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయిరి .
అయితే వీరు సున్నతిలేని వారిలో పడిపోయిన శూరుల దగ్గర పండు కొనరు ; వారు తమ యుధ్దాయుధములను చేతపట్టుకొని పాతాళములోనికి దిగిపోయి , తమ ఖడ్గములను తలల క్రింద ఉంచుకొని పండుకొందురు; వీరు సజీవుల లోకములో భయంకరులైరి గనుక వారి దోషము వారి యెముకలకు తగిలెను .
నీవు సున్నతిలేనివారి మధ్య నాశనమై కత్తి పాలైన వారియొద్ద పండుకొందువు .
అక్కడ ఎదోమును దాని రాజులును దాని అధిపతు లందరును ఉన్నారు; వారు పరాక్రమవంతులైనను కత్తి పాలైన వారియొద్ద ఉంచబడిరి ; సున్నతిలేని వారియొద్దను పాతాళములోనికి దిగిపోయినవారి యొద్దను వారును పండుకొనిరి .
అక్కడ ఉత్తరదేశపు అధిపతు లందురును సీదోనీయు లందరును హతమైన వారితో దిగిపోయియున్నారు ; వారు పరాక్రమవంతులై భయము పుట్టించినను అవమానము నొందియున్నారు; సున్నతి లేనివారై కత్తిపాలైన వారిమధ్య పండుకొనియున్నారు ; గోతిలోనికి దిగిపోయిన వారితోపాటు వారును అవమానము నొందుదురు .
కత్తి పాలైన ఫరోయు అతనివారందరును వారినిచూచి తమ సమూహ మంతటిని గూర్చి ఓదార్పు తెచ్చుకొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు .
సజీవుల లోకములో అతనిచేత భయము పుట్టించితిని గనుక ఫరోయు అతని వారందరును కత్తి పాలైనవారియొద్ద సున్నతిలేనివారితో కూడ పండుకొందురు , ఇదే ప్రభువగు యెహోవా వాక్కు .
తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనబరచుమనిరి.