
విచారముచేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించువారిచేత అవి చివికియున్నవి.
బాధచేత నా కన్ను క్షీణించుచున్నది యెహోవా , ప్రతిదినము నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నీవైపు నా చేతులు చాపుచున్నాను .
నా కనుదృష్టి దుఃఖముచేత మందమాయెను నా అవయవములన్నియు నీడవలె ఆయెను
వ్యర్థసహాయముకొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేము కనిపెట్టుచు రక్షింపలేని జనముకొరకు ఎదురు చూచుచుంటిమి.
దీనివలన మాకు ధైర్యము చెడియున్నది. సీయోను పర్వతము పాడైనది
యెహోవా, నీ కోపముచేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము.
యెహోవా, నేను కృశించి యున్నాను, నన్ను కరుణించుము యెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్ను బాగుచేయుము
నేను నీళ్లవలె పారబోయబడియున్నాను నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందు మైనమువలె కరగియున్నది.
నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొనియున్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి యున్నావు.
యెహోవా, కోపోద్రేకముచేత నన్ను గద్దింపకుము. నీ ఉగ్రతచేత నన్ను శిక్షింపకుము.
నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి. నీ చెయ్యి నామీద భారముగా నున్నది.
నీ కోపాగ్నివలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను నా పాపమునుబట్టి నా యెముకలలో స్వస్థతలేదు.
నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడియున్నవి.
నా మూర్ఖతవలన గలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి.
నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను.
నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు.
నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను నా మనోవేదననుబట్టి కేకలు వేయుచున్నాను
ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడియుండలేదు.
నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయెను నా కనుదృష్టియు తప్పిపోయెను.
మా ప్రాణము నేలకు క్రుంగియున్నది మా శరీరము నేలను పట్టియున్నది.
దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది.
నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునైయున్నాడు.
నేను ఆపదలతో నిండియున్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించియున్నది .
సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని . నేను త్రాణలేనివానివలె అయితిని .
చచ్చినవారిలో విడువబడినవాడనైతిని నేను సమాధిలో పడియున్న హతులలో ఒకనివలె అయితిని నీవిక స్మరింపనివారివలె అయితిని వారు నీ చేతిలోనుండి తొలగిపోయియున్నారు గదా.
పొగ యెగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి పొయిలోనిది కాలిపోయినట్లు నా యెముకలు కాలిపోయియున్నవి .
ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడిపోయియున్నది భోజనము చేయుటకే నేను మరచిపోవుచున్నాను .
నా మూల్గుల శబ్దమువలన నా యెముకలు నా దేహమునకు అంటుకొనిపోయినవి .
దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున
వ్యాధిచేత మంచమెక్కుటవలనను ఒకని యెముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునొందును
రొట్టెయు రుచిగల ఆహారమును వానికసహ్యమగును
వాని శరీరమాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనబడకుండిన యెముకలు పైకి పొడుచుకొని వచ్చును
వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకులయొద్దకు సమీపించును.