దేవా, వారు నీమీద తిరుగబడియున్నారు వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములనుబట్టి వారిని వెలివేయుము.
వారి పెదవుల మాటలనుబట్టియు వారి నోటి పాపమునుబట్టియు వారు పలుకు శాపములనుబట్టియు అబద్ధములనుబట్టియు వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక.
కోపముచేత వారిని నిర్మూలము చేయుము వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయుము దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూదిగంతములవరకు మనుష్యులు ఎరుగునట్లు చేయుము.(సెలా.)
వారి భోజనము వారికి ఉరిగా నుండును గాక వారు నిర్భయులైయున్నప్పుడు అది వారికి ఉరిగా నుండును గాక.
వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక వారి నడుములకు ఎడతెగని వణకు పుట్టించుము.
వారిమీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని పట్టుకొనును గాక
వారి కుమారులను క్షామమునకు అప్ప గింపుము, ఖడ్గబలమునకు వారిని అప్పగింపుము, వారి భార్యలు పిల్లలు లేనివారై విధవరాండ్రగుదురు గాక, వారి పురుషులు మరణహతులగుదురు గాక, వారి ¸యవనులు యుద్ధములో ఖడ్గముచేత హతులగుదురు గాక.
నన్ను పట్టుకొనుటకు వారు గొయ్యి త్రవ్విరి, నా కాళ్లకు ఉరులనొగ్గిరి; వారిమీదికి నీవు ఆకస్మికముగా దండును రప్పించుటవలన వారి యిండ్లలోనుండి కేకలు వినబడును గాక.
యెహోవా, నాకు మరణము రావలెనని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసేయున్నది, వారి దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగనియ్యకుము, నీ సన్నిధినుండి వారి పాపమును తుడిచివేయకుము; వారు నీ సన్నిధిని తొట్రిల్లుదురు గాక, నీకు కోపము పుట్టు కాలమున వారికి తగినపని చేయుము.
అలెక్సంద్రు అను కంచరివాడు నాకు చాల కీడు చేసెను , అతని క్రియల చొప్పున ప్రభువ తనికి ప్రతిఫల మిచ్చును;
అది యిచ్చినప్రకారము దానికి ఇయ్యుడి; దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి; అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపి పెట్టుడి.
అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?
మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు
భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు.
ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు
ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండకోపముచేత వారిని తల్లడింపజేయును
భూమిమీద నుండకుండ వారి గర్భఫలమును నీవు నాశనము చేసెదవు నరులలో నుండకుండ వారి సంతానమును నశింపజేసెదవు.
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ కాలమందు నీ మనస్సు లో అభిప్రాయములు పుట్టును ,
ప్రభువా, మనుష్యులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కాగా కృపచూపుటయు నీది.
మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు .
శపించుట వానికి ప్రీతి గనుక అది వానిమీదికి వచ్చియున్నది . దీవెనయందు వానికిష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను .
తాను పైబట్ట వేసికొనునట్లు వాడు శాపము ధరించెను అది నీళ్లవలె వాని కడుపులో చొచ్చియున్నది తైలమువలె వాని యెముకలలో చేరియున్నది
తాను కప్పుకొను వస్త్రమువలెను తాను నిత్యము కట్టుకొను నడికట్టువలెను అది వానిని వదలకుండును గాక.
నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాటలాడువారికి ఇదే యెహోవావలన కలుగు ప్రతికారము .
యెహోవా ప్రభువా , నీ నామమునుబట్టి నాకు సహాయము చేయుము నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము .
ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు .
సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు
ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును .
సత్ క్రియను ఓపికగా చేయుచు , మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్య జీవము నిచ్చును.
అయితే భేదములు పుట్టించి , సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారిమీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును.
అయితే మా దుష్క్రియలను బట్టియు మా గొప్ప అపరాధములను బట్టియు ఈ శ్రమలన్నియు మామీదికి వచ్చిన తరువాత, మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మామీద ఉంచి, మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి