దేెెవుడు మరచిపోయెను ఆయన విముఖుడై యెప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు.
నా దేవా, నీయందు నమ్మికయుంచియున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము నా శత్రువులను నన్నుగూర్చి ఉత్సహింపనియ్యకుము
నిర్హేతుకముగా నాకు శత్రువులైనవారిని నన్నుగూర్చి సంతోషింపనియ్యకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించువారిని కన్ను గీటనియ్యకుము.
ఆహా మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనకపోదురు గాక వాని మింగివేసితిమని వారు చెప్పుకొనకయుందురు గాక
ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు నన్నుబట్టి వారు సంతోషించకపోదురుగాక.
కనానీయులును ఈ దేశ నివాసులందరును విని, మమ్మును చుట్టుకొని మా పేరు భూమిమీద ఉండకుండ తుడిచివేసిన యెడల, ఘనమైన నీ నామమునుగూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపగా
అవి పాడైనవి , మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇశ్రాయేలు పర్వతములను గురించి పలికిన దూషణ మాటలన్నియు యెహోవానగు నాకు వినబడెనని నీవు తెలిసికొందువు .
పెద్ద నోరు చేసికొని మీరు నామీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను .
ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా లోక మంతయు సంతోషించునప్పుడు నాశనము నేను నీ మీదికి రప్పించెదను .
ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి గనుక నీకును ఆ ప్రకారముగానే చేసెదను ; శేయీరు పర్వతమా , నీవు పాడవు దువు , ఎదోము దేశము యావత్తును పాడైపోవును , అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు .
యెహోవా లెమ్ము, నరులు ప్రబలక పోవుదురు గాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురు గాక.
వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నందున వారు నీపైని విజయము పొంద జాలరు; ఇదే యెహోవా వాక్కు.
వీటినిబట్టి నేను ఏడ్చుచున్నాను నా కంట నీరు ఒలుకుచున్నది నా ప్రాణము తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్థులైరి శత్రువులు ప్రబలియున్నారు నా పిల్లలు నాశనమైపోయిరి.
నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.
ఎత్తయిన నాకోట ఆయనే, నేను అంతగా కదలింపబడను. ఎన్నాళ్లు మీరు ఒకనిపైబడుదురు?
ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తయిన కోట ఆయనే, నేను కదలింపబడను.
భక్తిహీనతవలన ఎవరును స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు