ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు
యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై యున్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి యున్నాడు.
యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యెహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు.
మా దేవుడు ఆకాశమందున్నాడు తనకిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు
యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాద పీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించునది ఏపాటిది?
మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదనగా.
యెహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజైయున్నాడు.
తమయొద్ద నుండకుండ మనుష్యులు నిన్ను తరుముదురు , నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి తినెదవు ; ఆకాశపు మంచు నీమీదపడి నిన్ను తడుపును ; సర్వోన్నతుడగుదేవుడు మానవుల రాజ్యముపైన అధికారియై యున్నాడనియు, తానెవనికి దాని ననుగ్రహింప నిచ్ఛయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలిసికొను వరకు ఏడు కాలములు నీకీలాగు జరుగును .
ఆ కాలము గడచిన పిమ్మట నెబుకద్నెజరను నేను మరల మానవబుద్ధిగలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి , చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రముచేసి ఘనపరచి స్తుతించితిని ; ఆయన ఆధిపత్యము చిరకాలమువరకు ఆయన రాజ్యము తర తరములకు నున్నవి.
భూ నివాసు లందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ; ఆయన పరలోక సేనయెడలను భూ నివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు ; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు .
గాక రాబోవు యుగమునందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొనియున్నాడు.
మరియు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.
అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని,
భూమిక్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును,
ఆయన పరలోకమునకు వెళ్లి దూతలమీదను అధికారుల మీదను శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు.