ఆయనే జ్ఞానరహస్యములు నీకు తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలిసికొందువు నీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయియున్నాడని తెలిసికొనుము.
అట్లైన జ్ఞానము ఎక్కడనుండి వచ్చును? వివేచన దొరకు స్థలమెక్కడనున్నది?
అది సజీవులందరి కన్నులకు మరుగైయున్నది ఆకాశపక్షులకు మరుగుచేయబడియున్నది.
మేము చెవులార దానిగూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును.
దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియును.
అతని సేవకులలో ఒకడు రాజవైన నా యేలినవాడా , ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరును లేరుగాని ఇశ్రాయేలులో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయుననెను .
హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా?
చీకటియైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటివలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి
ఆయన మరుగుమాటలను మర్మములను బయలుపరచును , అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును ; వెలుగుయొక్క నివాసస్థలము ఆయనయొద్దనున్నది .
కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచ బడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు.
మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.
కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చువరకు, దేనిని గూర్చియు తీర్పుతీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతివానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.
చీకటియు గాఢాంధకారమును మరల దానిని తమ యొద్దకు తీసికొనును గాక.మేఘము దాని కమ్మును గాక పగలును కమ్మునట్టి అంధకారము దాని బెదరించును గాక
వారందరు ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు.గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసియున్నది.
దుష్‌క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటియైనను మరణాంధకారమైనను లేదు.
ఆయన సప్తఋషీ నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు , కారు చీకటిని ఉదయముగా మార్చువాడు , పగటిని రాత్రి చీకటివలె మార్పుచేయువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు .
మన పాదములను సమాధాన మార్గము లోనికి నడిపించునట్లు చీకటి లోను మరణ చ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమునుబట్టి పై నుండి ఆయన మనకు అరుణోదయ దర్శన మనుగ్రహించెను .