
అయితే నేను దేవుని నాశ్రయించుదును.దేవునికే నా వ్యాజ్యెమును అప్పగించుదును.
నీవు జాగ్రత్తగా దేవుని వెదకినయెడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనినయెడల
నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైనయెడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధిల్లజేయును.
ఆయనతో సహవాసముచేసినయెడల నీకు సమాధానము కలుగును ఆలాగున నీకు మేలు కలుగును.
ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము.
సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను–మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్లుకొనిన యెడల, అన్యదేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్యనుండి తీసివేసి, పట్టుదలగలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోనుండి మిమ్మును విడిపించును.
అతడు తన మనస్సు యెహోవాను వెదకుటయందు నిలుపుకొనక చెడుక్రియలు చేసెను.
అయితే దేశములోనుండి నీవు దేవతాస్తంభములను తీసివేసి దేవునియొద్ద విచారణచేయుటకు నీవు మనస్సు నిలుపుకొనియున్నావు, నీయందు మంచి క్రియలు కనబడుచున్నవి.
ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రముననుగ్రహించెను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికాజ్ఞాపించెను
తన యజమానుని చిత్త మెరిగి యుండియు సిద్ధపడక, అతని చిత్తముచొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును.
ఐగుప్తులోనుండి ప్రధానులు వచ్చెదరు కూషీయులు దేవునితట్టు తమ చేతులు చాచుకొని పరుగెత్తివచ్చెదరు.
బాధచేత నా కన్ను క్షీణించుచున్నది యెహోవా, ప్రతిదినము నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నీవైపు నా చేతులు చాపుచున్నాను.
నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమివలె నా ప్రాణము నీకొరకు ఆశపడుచున్నది.