అజర్యా
2 దినవృత్తాంతములు 26:17

యాజకుడైన ఆజర్యాయు అతనితోకూడ ధైర్యవంతులైన యెహోవా యాజకులు ఎనుబది మందియు అతని వెంబడి లోపలికి పోయిరి.

1 రాజులు 2:35

రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియమించెను.

1దినవృత్తాంతములు 6:8

అహీటూబు సాదోకును కనెను, సాదోకు అహిమయస్సును కనెను,

1దినవృత్తాంతములు 6:14

అజర్యా శెరాయాను కనెను, శెరాయా యెహోజాదాకును కనెను.

యెహెజ్కేలు 44:15

ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధస్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతివారగు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి , క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు ; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు .

మొదలుపెట్టినప్పటినుండి
సామెతలు 3:9

నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము.

హగ్గయి 2:18

మీరు ఆలోచించుకొనుడి. ఇంతకుముందుగా తొమి్మదవ నెల యిరువది నాలుగవ దినమునుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటనుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి.

మలాకీ 3:10

నా మందిరము లో ఆహార ముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి ; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి ,పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు .

1 తిమోతికి 4:8

శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానము తో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును .

మేము సమృద్ధిగా భోజనముచేసినను చాలా మిగులుచున్నది
2 రాజులు 4:43

అయితే అతని పనివాడు నూరు మందికి వడ్డించుటకు ఇవి యెంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చియున్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరల ఆజ్ఞ ఇచ్చెను.

2 రాజులు 4:44

పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను .

మత్తయి 15:37

వారందరు తిని తృప్తి పొందినమీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండ ఎత్తిరి.

ఫిలిప్పీయులకు 4:18

నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది . మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను ; అవి మనోహరమైన సువాసనయు , దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై యున్నవి .

యెహోవా
ఆదికాండము 26:12

ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలముపొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను.

ఆదికాండము 30:27-30
27

అందుకు లాబాను అతనితో - నీ కటాక్షము నా మీదనున్న యెడల నా మాట వినుము; నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను.

28

మరియు అతడు - నీ జీతమింతయని నాతో స్పష్టముగా చెప్పుము అది యిచ్చెదననెను.

29

అందుకు యాకోబు అతని చూచి - నేను నీకెట్లు కొలువు చేసితినో నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియును;

30

నేను రాకమునుపు నీకుండినది కొంచెమే; అయితే అది బహుగా అభివృద్ధి పొందెను; నేను పాదము పెట్టిన చోటెల్ల యెహోవా నిన్ను ఆశీర్వదించెను; నేను నా యింటి వారికొరకు ఎప్పుడు సంపాద్యము చేసికొందుననెను.

ఆదికాండము 39:5

అతడు తన యింటిమీదను తనకు కలిగినదంతటిమీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని యింటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము యింటిలో నేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను.

ఆదికాండము 39:23

యెహోవా అతనికి తోడైయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిగూర్చియు విచారణ చేయకయుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను.

లేవీయకాండము 25:21

అయితే నేను ఆరవయేట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను; అది మూడేండ్ల పంటను మీకు కలుగజేయును.

లేవీయకాండము 26:4

మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటల నిచ్చును, మీ పొలములచెట్లు ఫలించును,

లేవీయకాండము 26:5

మీ ద్రాక్షపండ్ల కాలమువరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా మీ దేశములో నిర్భయముగా నివసించెదరు.

ద్వితీయోపదేశకాండమ 28:8

నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును.

సామెతలు 10:22

యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు.

2 కొరింథీయులకు 9:8-11
8

మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు.

9

ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడియున్నది.

10

విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్యభాగ్యముగలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధిపొందించును.

11

ఇట్టి, ఔదార్యమువలన మాద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.