
అతడు–ఊరకుండుడని వారికి చేసైగచేసి, ప్రభువు తన్ను చెరసాలలోనుండి యేలాగు తీసికొనివచ్చెనో వారికి వివరించి–యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి
అప్పుడు పౌలు నిలువబడి చేసైగ చేసి ఇట్లనెను
అప్పుడు యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెక్సంద్రు సైగచేసి జనులతో సమాధానము చెప్పుకొనవలెననియుండెను.
అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్లమీద నిలువబడి జనులకు చేసైగ చేసెను. వారు నిశ్చబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీభాషలో ఇట్లనెను–
అగ్రిప్ప పౌలును చూచి–నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి యీలాగు సమాధానము చెప్పసాగెను–
ఇది యేదోయుక ఉపదేశమును, పేళ్లను, మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాని చూచుకొనుడి; ఈలాటి సంగతులనుగూర్చి విమర్శ చేయుటకు నాకు మనస్సులేదని యూదులతో చెప్పి
నరునికి నరుడు తప్పు చేసినయెడల దేవుడు విమర్శచేయును గాని యెవరైన యెహోవా విషయములో పాపము చేసినయెడల వానికొరకు ఎవడు విజ్ఞాపనము చేయును? అనెను. అయితే యెహోవా వారిని చంపదలచి యుండెను గనుక వారు తమ తండ్రియొక్క మొఱ్ఱను వినకపోయిరి.
ఆయన–ఓయీ, మీ మీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నె వడు నియమించెనని అతనితో చెప్పెను.
–దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక పట్టణములో ఉండెను.
నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి,మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి;