నేనెవడనని
మత్తయి 5:47

మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా.

మత్తయి 16:15

అందుకాయన–మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి నడిగెను.

మత్తయి 22:42

–క్రీస్తునుగూర్చి మీకేమి తోచు చున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు–ఆయన దావీదు కుమారుడని చెప్పిరి.

దేవుని క్రీస్తువనెను
లూకా 22:67

–నీవు క్రీస్తు వైతే మాతో చెప్పుమనిరి . అందుకాయన– నేను మీతో చెప్పిన యెడల మీరు నమ్మరు .

మత్తయి 16:16

అందుకు సీమోను పేతురు–నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను.

మత్తయి 16:17

అందుకు యేసు–సీమోను బర్‌ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలు పరచలేదు.

మత్తయి 26:63

అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి–నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు–నీవన్నట్టే.

మార్కు 8:29

అందుకాయన–మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారినడుగగా పేతురు–నీవు క్రీస్తువని ఆయనతో చెప్పెను.

మార్కు 14:61

అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు–పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? అని ఆయన నడుగగా

యోహాను 1:41

ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి–మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి

యోహాను 1:49

నతనయేలు–బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చెను.

యోహాను 4:29

మీరు వచ్చి, నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి; ఈయన క్రీస్తుకాడా అని ఆ ఊరివారితో చెప్పగా

యోహాను 4:42

మామట్టుకు మేము విని, యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి.

యోహాను 6:69

నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను.

యోహాను 7:41

మరికొందరుఈయన క్రీస్తే అనిరి; మరికొందరుఏమి? క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా?

యోహాను 11:27

ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను.

యోహాను 20:31

యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమి్మ ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.

అపొస్తలుల కార్యములు 8:37

ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి.

అపొస్తలుల కార్యములు 9:22

అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను.

అపొస్తలుల కార్యములు 17:3

నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయియున్నాడనియు లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు, వారితో మూడువిశ్రాంతిదినములు తర్కించుచుండెను.

1 యోహాను 5:1

యేసే క్రీస్తయి యున్నాడని నమ్ము ప్రతివాడును దేవునిమూలముగా పుట్టియున్నాడు. పుట్టించినవానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును.